సచిన్ కూడా 150 బంతుల్లో 50 పరుగులే చేశాడు!

Tue,February 12, 2019 01:44 PM


మైదానంలో రోజంతా బ్యాటింగ్ చేయగల ఓర్పు, సహనం ప్రస్తుత భారత క్రికెట్లో టెస్టు స్పెషలిస్ట్ చెతేశ్వర్ పుజారాకే సాధ్యమైంది. టెస్టు క్రికెట్లో తాను నిదానంగా బ్యాటింగ్ చేస్తానని, తన ఆట చూడటానికి అంత ఆసక్తిగా అనిపించదని భావిస్తున్న వారి కోసం అలా ఆడటానికి గల కారణాలను పుజారా వివరించాడు. అన్నిసార్లు దూకుడుగా బ్యాటింగ్ చేయడం వీలుకాదని.. కొన్నిసార్లు కఠిన పరిస్థితులకు అనుగుణంగా బ్యాట్స్‌మెన్ బ్యాటింగ్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నాడు.


రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్ క్లాస్ బ్యాటింగ్‌తో అలరిస్తారు. సహజంగానే టెండూల్కర్ విభిన్నమైన ఆటగాడు. ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించేలా ఆడేందుకు ఎక్కువగా ఇష్టపడతాడు. పరిస్థితులు అనుకూలించని సందర్భంలో సచిన్ కూడా 150 బంతుల్లో 50 పరుగులే చేశాడు. అందులో తప్పులు చూడాల్సిన అవసరం లేదు. ఎలాంటి పరిస్థితుల్లో ఆడుతున్నాం.. దానికి అనుగుణంగా బ్యాటింగ్ చేస్తున్నామనే విషయాన్ని అర్థం చేసుకోవాలి.

ఆస్ట్రేలియా పర్యటన తర్వాత టెస్టు క్రికెట్లో గొప్పగా రాణించాలంటే ఎలా ఆడాలనే విషయాన్ని అభిమానులు కూడా గ్రహించారు. భారత టీమ్ మేనేజ్‌మెంట్ మాత్రమే కాదు.. క్రికెట్ అభిమానులు కూడా నేను బ్యాటింగ్ చేసిన తీరుపై ప్రశంసించడం ప్రారంభించారు. నన్ను నేను నమ్మడంతో పాటు.. నా సామర్థ్యంపై నాకు విశ్వాసం ఉంది. మిగతా వారు నా గురించి ఏమనుకుంటున్నారనే విషయంపై నేను ఆందోళన చెందను. కొన్నిసార్లు జట్టు కోసం మంచి పనులు చేయాల్సిన అవసరం ఉంటుంది. అని పుజారా ఓ ఇంటర్వ్యూలో వివరించాడు.

ఆస్ట్రేలియా గడ్డపై చరిత్రాత్మక టెస్టు సిరీస్ నెగ్గడంలో కీలక పాత్ర పోషించిన పుజారా రికార్డు స్థాయిలో 521 పరుగులు సాధించాడు. సిరీస్‌లో 1258 బంతులు ఎదుర్కొన్నాడు. పుజారా తర్వాత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 684 బంతులు ఆడాడు.

3183
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles