మోర్గాన్ న‌యా చ‌రిత్ర‌.. రోహిత్, గేల్ రికార్డు బ్రేక్

Tue,June 18, 2019 06:27 PM

Eoin Morgan hits his 17th six of the innings

మాంచెస్టర్: వన్డే వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్ సారథి ఇయాన్ మోర్గాన్ రికార్డులు కొల్లగొట్టాడు. ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో కొంతసేపు పరుగుల సునామీ సృష్టించాడు. బంతిని స్టాండ్స్‌లోకి పంపడమే లక్ష్యంగా కసిగా బాదాడు. వన్డేల్లో అసాధారణ స్థాయిలో ఒక ఇన్నింగ్స్‌లో 17 సిక్సర్లు బాది ప్రపంచ రికార్డు నెలకొల్పి సరికొత్త చరిత్ర సృష్టించాడు. గతంలో విండీస్ వీరుడు క్రిస్‌గేల్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ పేరిట సంయుక్తంగా ఉన్న 16 సిక్సర్ల రికార్డును తాజాగా మోర్గాన్ బ్రేక్ చేశాడు.

అద్వితీయ బ్యాటింగ్‌తో 71 బంతుల్లోనే 148 పరుగులు చేశాడు. మోర్గాన్ ఇన్నింగ్స్‌లో 4ఫోర్లు, 17 సిక్సర్లు ఉండటం విశేషం. 47వ ఓవర్లో అఫ్గాన్ బౌలర్ గుల్బదిన్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడి వెనుదిర‌గ‌డంతో అఫ్గాన్‌ ఊపిరి పీల్చుకుంది. వన్డే కెరీర్‌లో మోర్గాన్ 200 సిక్సర్ల మైలురాయిని అందుకున్నాడు. వన్డేల్లో ఈ ఘనత సాధించిన ఎనిమిదో బ్యాట్స్‌మన్ మోర్గాన్ కావడం విశేషం.6201
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles