ఇంగ్లాండ్‌ కొత్త కోచ్‌గా క్రిస్‌ సిల్వర్‌వుడ్‌..

Tue,October 8, 2019 11:04 AM

లండన్‌: ఇంగ్లాండ్‌ క్రికెట్‌ జట్టుకు టీమ్‌ యాజమాన్యం కొత్త కోచ్‌ను నియమించింది. 44 ఏళ్ల సిల్వర్‌వుడ్‌ను హెడ్‌కోచ్‌గా అపాయింట్‌ చేసింది. క్రిస్‌ ప్రస్తుతం ఇగ్లాండ్‌ ఫాస్ట్‌ బౌలింగ్‌ కోచ్‌గా ఉన్నాడు. ట్రేవర్‌ బేలిస్‌ స్థానంలో సిల్వర్‌వుడ్‌ హెడ్‌కోచ్‌ అవతారమెత్తాడు. ఇంగ్లాండ్‌ జట్టు నవంబర్‌లో న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలోనే క్రిస్‌ అధికారికంగా కోచ్‌గా భాద్యతలు స్వీకరిస్తాడు. న్యూజిలాండ్‌లో ఇరు జట్లు ఐదు టీ-20లు, 2 టెస్టు మ్యాచ్‌లు ఆడతాయి. ఇంగ్లాండ్‌ కోచ్‌ పదవి కోసం సౌతాఫ్రికా మాజీ క్రికెటర్‌, ఇండియా మాజీ కోచ్‌ అయిన గ్యారీ కిరిస్టెన్‌, సర్రే క్రికెట్‌ డైరెక్టర్‌ అలెక్‌ స్టీవార్ట్‌ పోటీలో నిలవగా.. సిల్వర్‌వుడ్‌ సరైన కోచ్‌ అని జట్టు మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌ అష్లే గిల్స్‌ తెలిపాడు. అదేవిధంగా, టెస్టు కెప్టెన్‌ జో రూట్‌, వన్డే, టీ 20 కెప్టెన్‌ మోర్గాన్‌తో సిల్వర్‌వుడ్‌కు సత్సంబంధాలున్నాయి. వారిని అతడు బాగా అర్థం చేసుకోగలడని ఆయన అన్నారు.


44 ఏళ్ల సిల్వర్‌వుడ్‌ ఇంగ్లాండ్‌ తరఫున 1996-2002 మధ్య కాలంలో 6 టెస్టులు, 7 వన్డేలు ఆడాడు. 2017లో కోచ్‌గా ఎస్సెక్స్‌కు కౌంటీ ఛాంపియన్‌షిప్‌ అందించాడు. అదే ఏడాది ఇంగ్లాండ్‌ టీమ్‌కు బౌలింగ్‌ కోచ్‌గా ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా ఇంగ్లాండ్‌ నూతన కోచ్‌ మాట్లాడుతూ.. ఇంగ్లాండ్‌కు హెడ్‌ కోచ్‌గా ఎంపికవ్వడం సంతోషంగా ఉంది. టీమ్‌తో జాయిన్‌ అవ్వడానికి ఆతృతగా ఉన్నాను. ఇంగ్లాండ్‌ చాలా పటిష్ట జట్టు. జట్టులో చాలా మంది ఛాంపియన్‌ ఆటగాళ్లు ఉన్నారు. ఇంగ్లాండ్‌కు మరిన్ని విజయాలు అందించడమే తన లక్ష్యమని క్రిస్‌ సిల్వర్‌వుడ్‌ అన్నారు.

595
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles