30 బంతుల్లో 95 ప‌రుగులు.. వీడియో

Sun,August 6, 2017 03:06 PM

Englands Alex Hales hit 95 Runs of just 30 Balls in Natwest T20 Blast

లండ‌న్‌: ఇంగ్లండ్ ఓపెన‌ర్ అలెక్స్ హేల్స్ విశ్వ‌రూపం చూపించాడు. నాట్‌వెస్ట్ టీ20 బ్లాస్ట్‌లో భాగంగా నాటింగ్‌హామ్‌షైర్ ఔట్‌లాస్‌, డ‌ర్హ‌మ్ జెట్స్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో ఈ విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్ ఆడాడు హేల్స్‌. కేవ‌లం 30 బంతుల్లో 95 ర‌న్స్ చేశాడు. అందులో 9 సిక్స‌ర్లు, 9 ఫోర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన డ‌ర్హ‌మ్ జెట్స్ 183 ర‌న్స్ చేసింది. త‌ర్వాత నాటింగ్‌హామ్‌ చేజింగ్‌లో మ‌రో ఓపెన‌ర్ రికీ వెస్సెల్స్‌తో క‌లిసి కేవ‌లం 42 బంతుల్లోనే 126 ప‌రుగులు జోడించాడు హేల్స్‌. ఈ ఇద్ద‌రి జోడీ ప‌వ‌ర్‌ప్లే (6 ఓవ‌ర్లు)లోనే 106 ర‌న్స్ చేయ‌డం విశేషం. ముఖ్యంగా హేల్స్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. గేల్ ఆల్‌టైమ్ ఫాస్టెస్ట్ సెంచ‌రీ (30 బంతుల్లో) రికార్డును స‌మం చేసేలా క‌నిపించాడు హేల్స్‌. అయితే 29 బంతుల్లో 95 ర‌న్స్ చేసిన తర్వ‌త 30వ బంతికి ఔట‌య్యాడు. ట్రెంట్ బ్రిడ్జ్‌లో ఆడ‌టానికి తాను ఇష్ట‌ప‌డ‌తాన‌ని, ఇక్క‌డి వికెట్లు బ్యాటింగ్‌కు స్వ‌ర్గ‌ధామ‌మ‌ని హేల్స్ అన్నాడు. ఫాస్టెస్ట్ టీ20 సెంచ‌రీ చేయ‌డానికి ప్ర‌య‌త్నించిన‌ట్లు అత‌ను చెప్పాడు. ఈ కింద ఉన్న లింక్‌లో అత‌ని విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్ వీడియో చూడొచ్చు.


2883
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles