మూడో వ‌న్డే: భారత్ బ్యాటింగ్.. ఆ ముగ్గురి స్థానంలో..

Tue,July 17, 2018 04:41 PM

England win toss, elect to field against India


లీడ్స్: వన్డే సిరీస్‌లో భాగంగా ఆతిథ్య ఇంగ్లాండ్, భారత్ మధ్య చివరిదైన మూడో వన్డే లీడ్స్ వేదికగా ఆరంభమైంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. కేఎల్ రాహుల్, ఉమేశ్ యాదవ్, సిద్ధార్థ్ కౌల్ స్థానంలో దినేశ్ కార్తీక్, భువనేశ్వర్ కుమార్, శార్దుల్ ఠాకూర్‌లను భార‌త కెప్లెన్ విరాట్ కోహ్లీ తుది జట్టులోకి తీసుకున్నాడు. మరోవైపు ఇంగ్లాండ్ ఓపెనర్ జేసన్ రాయ్ స్థానంలో జేమ్స్ విన్స్ టీమ్‌లోకి వచ్చినట్లు ఇంగ్లాండ్ సారథి ఇయాన్ మోర్గాన్ తెలిపాడు.

తొలి వన్డేలో 8 వికెట్ల తేడాతో అద్భుత విజయం అందుకున్న టీమిండియా.. పేలవ బ్యాటింగ్‌తో రెండో వన్డేలో 86 పరుగుల తేడాతో కోహ్లీసేన చిత్తుగా ఓడింది. టీ20 సిరీస్ మాదిరిగానే వన్డే సిరీస్‌నూ సొంతం చేసుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది. ఇక్కడ ఆడిన చివరి నాలుగు వన్డేల్లోనూ ఇంగ్లీష్ జట్టే విజేతగా నిలిచింది. గత రెండు మ్యాచ్‌ల పిచ్‌లలాగే మూడో వన్డే పిచ్ కూడా బ్యాటింగ్‌కు అనుకూలించనుంది. గత ఐదేళ్ల నుంచి లీడ్స్ మైదానంలో సగటు స్కోరు 298గా నమోదైంది.


3413
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS