రెండుసార్లు అరెస్ట‌యిన ఇంగ్లండ్ స్టార్ క్రికెట‌ర్‌

Mon,September 11, 2017 03:05 PM

England Star Cricketer Kevin Petersen arrested in Geneva and London Airports

జెనీవా/ల‌ండ‌న్‌: ఇంగ్లండ్ స్టార్ క్రికెట‌ర్ కెవిన్ పీట‌ర్స‌న్ ఒకే రోజు రెండుసార్లు అరెస్ట‌య్యాడు. ఒక‌సారి జెనీవా ఎయిర్‌పోర్ట్‌లో.. మ‌రోసారి లండ‌న్‌లోని హీత్రూ ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు అత‌న్ని అదుపులోకి తీసుకున్నారు. అత‌నికి ఎంతో ఇష్ట‌మైన గోల్ఫ్ ఆటే కేపీని చిక్కుల్లో ప‌డేసింది. తొలిసారి జెనీవా ఎయిర్‌పోర్ట్‌లో పీట‌ర్స‌న్‌ను అరెస్ట్ చేసి తాత్కాలికంగా సెల్‌లో ఉంచారు. ఇంత‌కీ అత‌ను చేసిన త‌ప్పేంటో తెలుసా? ఎయిర్‌పోర్ట్‌లో గోల్ఫ్ క్ల‌బ్‌ను ఊప‌డం. గోల్ఫ్‌లో బాల్‌ను కొట్టే స్టైల్ తెలుసు క‌దా.. అలాగే ఎయిర్‌పోర్ట్‌లో ఓ షాట్ ఆడుతున్న‌ట్లు త‌న క్ల‌బ్‌ను అడ్డంగా ఊపాడు కేపీ. దీంతో పోలీసులు అత‌న్ని సెల్‌లో వేశారు. ఈ విష‌యాన్ని కేపీనే ట్విట్ట‌ర్‌లో షేర్ చేసుకున్నాడు.


ఇంత జ‌రిగినా కేపీ మాత్రం మార‌లేదు. లండ‌న్ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన త‌ర్వాత కూడా ఇలాగే వ్య‌వ‌హ‌రించాడు. దీంతో అక్క‌డి పోలీసులు మరోసారి పీట‌ర్స‌న్‌ను అదుపులోకి తీసుకొని వార్నింగ్ ఇచ్చి పంపించేశారు. ఈ మ‌ధ్యే ఇంగ్లండ్ క్రికెట్‌కు కేపీ గుడ్‌బై చెప్పిన విష‌యం తెలిసిందే. 2013 యాషెస్ సిరీస్ త‌ర్వాత కేపీని ఇంగ్లండ్ ప‌క్క‌న పెట్టేసింది.

2330
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles