భారత్‌తో తలపడే ఇంగ్లాండ్ జట్టిదే

Sat,August 18, 2018 01:12 PM

England include Ben Stokes in the XI for third Test against India

ట్రెంట్‌బ్రిడ్జ్: వరుసగా రెండు టెస్టుల్లో విజయం సాధించి జోరుమీదున్న ఆతిథ్య ఇంగ్లాండ్‌తో మూడో టెస్టు శనివారం ఆరంభంకానుంది. ఇప్పటికే 0-2తో వెనకబడ్డ భారత్‌కు ఇది చావోరేవో పోరు. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య మూడో టెస్ట్ రసవత్తరంగా సాగే అవకాశముంది. సిరీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే కోహ్లీసేన బలంగా పుంజుకొని టెస్టులో గెలవాల్సిందే. ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్‌పై కోర్టు విచారణ పూర్తైన నేపథ్యంలో అతన్ని మూడో టెస్టుకు ఇంగ్లాండ్ ఎంపికచేసింది. ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో జట్టును గెలిపించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న సామ్ కర్రన్‌ను జట్టులో చోటుదక్కలేదని ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ శుక్రవారమే వెల్లడించాడు. అతని స్థానంలో బెన్‌స్టోక్స్‌ను తుదిజట్టులోకి తీసుకున్నట్లు తెలిపాడు. కర్రన్‌ను టీమ్ నుంచి తప్పించడం చాలా కఠినమైన నిర్ణయమని రూట్ మీడియాతో పేర్కొన్నాడు. తుది జట్టులో కోహ్లీసేన కొన్ని మార్పులతో బరిలో దిగే అవకాశం ఉంది. లార్డ్స్ టెస్టులో టీమిండియా బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే.మధ్యాహ్నం: 3.30 నుంచి సోనీ సిక్స్, సోనీ టెన్-3లో మ్యాచ్‌ను ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా చూడొచ్చు.


ఇంగ్లాండ్ టీమ్: జో రూట్(కెప్టెన్), కీటన్ జెన్నింగ్స్, అలిస్టర్ కుక్, ఒలీ పోప్, జానీ బెయిర్‌స్టో(వికెట్ కీపర్), జోస్ బట్లర్, బెన్ స్టోక్స్, క్రిస్‌వోక్స్, అదిల్ రషీద్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్

2749
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles