ఇంగ్లాండ్‌తో మూడో టెస్టులో భారత్ బ్యాటింగ్

Sat,August 18, 2018 03:17 PM

England have won the toss and have opted to field

నాటింగ్‌హామ్: ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్, భారత్ మధ్య మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. మూడో టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ బౌలింగ్ ఎంచుకున్నాడు. సామ్ కర్రన్‌కు జట్టులో చోటుదక్కలేదని అతని స్థానంలో బెన్‌స్టోక్స్‌ను టీమ్‌లోకి తీసుకుంటున్నట్లు జో రూట్ శుక్రవారమే వెల్లడించాడు. గత టెస్టులో దారుణ బ్యాటింగ్‌తో నిరాశపరిచిన ఓపెనర్ మురళీ విజయ్‌కు టీమిండియా మేనేజ్‌మెంట్ ఉద్వాసన ప‌లికింది. అతని స్థానంలో ఓపెనర్ శిఖర్ ధావన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. యువ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్థానంలో గాయం నుంచి కోలుకున్న పేసర్ బుమ్రా, వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ దినేశ్ కార్తీక్ స్థానంలో యువ ఆటగాడు రిషబ్ పంత్‌కు అవకాశం ఇచ్చారు. సిరీస్‌లో నిలవాలంటే భారత్ ఈ టెస్టులో తప్పక గెలవాల్సిందే. జట్టులో మార్పులతో కోహ్లీసేన ఏమేరకు ప్రదర్శన చేస్తుందో చూడాలి.

భారత జట్టు: శిఖర్ ధావన్, లోకేశ్ రాహుల్, చెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానె, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్య, అశ్విన్, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, బుమ్రా

ఇంగ్లాండ్ టీమ్: జో రూట్(కెప్టెన్), కీటన్ జెన్నింగ్స్, అలిస్టర్ కుక్, ఒలీ పోప్, జానీ బెయిర్‌స్టో(వికెట్ కీపర్), జోస్ బట్లర్, బెన్ స్టోక్స్, క్రిస్‌వోక్స్, అదిల్ రషీద్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్

2550
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS