టార్గెట్ 464.. భారత్ 2/3

Mon,September 10, 2018 09:40 PM

England decalre at 423/8, setting India a target of 464

లండన్: భారత్‌తో జరుగుతున్న ఐదో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసిన ఇంగ్లాండ్ జట్టు ఎట్టకేలకు డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని భారత్‌కు 464 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్ అలిస్టర్ కుక్(147), కెప్టెన్ జో రూట్(125) భారీ శతకాలతో చెలరేగడంతో 112.3 ఓవర్లలో 8 వికెట్లకు 423 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్ ఆరంభంలోనే మూడు వికెట్లు చేజార్చుకుంది. ఆండర్సన్ వేసిన మూడో ఓవర్లోనే ఓపెనర్ శిఖర్ ధావన్(1), ఛతేశ్వర్ పుజారా(1) వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయారు. ఆతరువాత క్రీజులోకి వచ్చిన సారథి విరాట్ కోహ్లీ బ్రాడ్ బౌలింగ్‌లో ఎదుర్కొన్న తొలి బంతినే కీపర్ బెయిర్‌స్టోకు క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరిగాడు. టాప్ ఆర్డర్‌లో కీలక వికెట్లు కోల్పోవడంతో భారత్‌కు భారీ పరాజయం తప్పేలా లేదు. 3.2 ఓవర్లలో రెండు పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది టీమ్‌ఇండియా.

4397
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles