టీమిండియాపై ఇంగ్లండ్ విజయం

Sun,January 22, 2017 09:45 PM

England beat India by 5 runs in the 3rd ODI

కోల్‌కతా : కోల్‌కతా వన్డేలో టీమిండియాపై ఇంగ్లండ్ విజయం సాధించింది. ఐదు పరుగుల తేడాతో ఇంగ్లండ్ గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 8 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసి భారత్‌కు 322 పరుగులు లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే భారత్ విజయానికి దగ్గరగా వెళ్లి ఓటమిపాలైంది. జాదవ్, హార్ధిక్ పాండ్యా పరుగుల వర్షం కురిపించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. వీరి పోరాటం వృథా అయింది. మొత్తానికి భారత్‌దే సిరీస్. తొలి రెండు మ్యాచ్‌లు భారత్ గెలుపొందిన విషయం తెలిసిందే. టీమిండియా 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. చివరి వన్డేలో ఇంగ్లండ్ స్కోర్ 321/8, భారత్ స్కోర్ 316/9.

జాదవ్ 90(12 ఫోర్లు, ఒక సిక్స్), పాండ్యా 56(4 ఫోర్లు, 2 సిక్స్‌లు), కోహ్లీ 55(8 ఫోర్లు), యువరాజ్ సింగ్ 45(ఐదు ఫోర్లు, ఒక సిక్స్), ధోనీ 25(ఒక సిక్స్, ఒక ఫోర్) పరుగులు చేశారు. స్టాక్స్ 3, వోక్స్, బాల్ చెరో రెండు వికెట్లు, విల్లీ, ప్లంకెట్ట్ చెరో ఒక వికెట్ తీసుకున్నారు. కేదర్ జాదవ్ కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ వచ్చింది.

1282
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles