టీకేఆర్ థీమ్ సాంగ్‌లో బ్రావో, షారుఖ్ ఖాన్ స్టెప్పులు: వీడియో

Sat,August 11, 2018 01:59 PM

Dwayne Bravo- Shah Rukh Khan Feature in TKR Anthem for CPL 2018

న్యూఢిల్లీ: విండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో అత్యుత్తమ టీ20 క్రికెటర్ మాత్రమే కాదు.. తన ఆటపాటలతో మైదానంలో, బయట కూడా చాలాసార్లు ఛాంపియన్ సాంగ్‌తో స్టెప్పులేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ప్రస్తుతం తమ దేశ క్రికెట్ బోర్డు ఆధ్వర్యంలో కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్) జరుగుతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు సహయజమానిగా ఉన్న బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్.. సీపీఎల్‌లో ట్రిబాగో నైట్ రైడర్స్(టీకేఆర్) ఫ్రాంఛైజీకి కూడా కో-ఓనర్‌గా వ్యవహరిస్తున్నాడు. ట్రిబాగో జట్టుకు బ్రావో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు.

ప్రస్తుత సీజన్‌లో తమ జట్టు అభిమానులను అలరించేందుకు అతడు ప్రత్యేక పాటను రూపొందించాడు. ఈ పాటలో బ్రావోతో పాటు షారుఖ్ కూడా చిందులేశాడు. దీనికి సంబంధించిన సాంగ్‌ను తాజాగా బ్రావో తన ట్విటర్ ఖాతా ద్వారా ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు. సీపీఎల్-2018 కోసం ఈ రోజు అధికారికంగా టీకేఆర్ థీమ్ Bowl Them Out సాంగ్‌ను లాంచ్ చేస్తున్నాను అని వెల్లడించాడు. టీకేఆర్ కోసం రూపొందించిన పాటలో కనువిందు చేసిన షారుఖ్‌ను ధన్యవాదాలు చెబుతున్నాను. నా కల నేడు నిజమైంది. అని వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఈ సాంగ్‌కు ఫ్యాన్స్ నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది.


1069
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles