రిటైర్మెంట్ ప్రకటించిన డ్వెయిన్ బ్రావో

Thu,October 25, 2018 12:15 PM

Dwayne Bravo announces retirement from international cricket

బార్బిడోస్: వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వెయిన్ బ్రావో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. 14 ఏళ్ల ఇంటర్నేషనల్ కెరీర్‌కు ముగింపు పలికనట్లు అతను తెలిపాడు. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు పేర్కొన్నాడు. అయితే ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ టీ20 లీగ్ టోర్నీల్లో మాత్రం పాల్గొననున్నట్లు అతను చెప్పాడు. 2004లో వెస్టిండీస్ తరపున బ్రావో అరంగేట్రం చేశాడు. మొత్తం 40 టెస్టులు, 164 వన్డేలు, 66 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అయితే విండీస్ తరపున తన చివరి వన్డేను రెండేళ్ల క్రితం ఆడాడు. ఇన్నాళ్లూ తన సక్సెస్‌లో భాగమైన ప్రతి ఒకరికి బ్రావో ధన్యవాదాలు తెలుపుతూ ఓ ప్రకటన రిలీజ్ చేశాడు. క్రికెటర్‌గా తన ప్రొఫెషనల్ కెరీర్‌ను కొనసాగించనుట్లు బ్రావో చెప్పాడు. నాలుగేళ్ల క్రితం భారత్‌లో పర్యటించిన విండీస్ టీమ్‌కు బ్రావో కెప్టెన్‌గా చేశాడు. కానీ ఆ టోర్నీ సమయంలో విండీస్ అర్ధాంతరంగా స్వదేశానికి వెనుదిరిగి వెళ్లింది. బ్రావో టెస్టుల్లో మొత్తం 2200 పరుగులు చేసి 86 వికెట్లు తీసుకున్నాడు. ఇక వన్డేల్లో 2968 రన్స్ చేసి 199 వికెట్లు తీసుకున్నాడు. టీ20 క్రికెట్‌లో 1142 రన్స్ చేసి 52 వికెట్లు తీశాడు.
1479
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles