ప్రపంచకప్ తర్వాత వన్డేలకు గుడ్‌బై..

Fri,March 15, 2019 03:29 PM

Duminy to Retire from ODIs After World Cup

ముంబై: అంతర్జాతీయ వన్డేలకు వీడ్కోలు పలికే అంశంపై సౌతాఫ్రికా ఆల్‌రౌండర్‌ జేపీ డుమిని ఒక ప్రకటన చేశాడు. ఇంగ్లాండ్‌ ఆతిథ్యమివ్వనున్న 2019 వరల్డ్‌కప్‌ తర్వాత వన్డే కెరీర్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు తెలిపాడు. గతంలో 2011, 2015 ప్రపంచకప్‌లలో దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించిన డుమిని మూడోసారి మెగాటోర్నీలో బరిలోకి దిగబోతున్నాడు. 2017లో టెస్టు, ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన డుమిని అప్పటి నుంచి పరిమిత ఓవర్ల క్రికెట్‌పై దృష్టి సారించాడు. ఇంటర్నేషనల్‌ క్రికెట్‌కు ముగింపు పలికే సమయం వచ్చిందని తాను భావిస్తున్నట్లు డుమిని పేర్కొన్నాడు.

న్యూలాండ్స్‌ వేదికగా శ్రీలంకతో ఆఖరిదైన ఐదో వన్డే శనివారం జరగనుంది. స్వదేశంలో డుమినికిదే ఆఖరి వన్డే కావడం విశేషం. 2019 ఐపీఎల్‌ వేలానికి ముందు ముంబయి ఇండియన్స్‌ జట్టు జేపీని విడుదల చేసింది. వేలంలో అతన్ని ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయలేదు. ప్రస్తుతం సౌతాఫ్రికా టీ20 జట్టుకు అందుబాటులో ఉండనున్నాడు.

2679
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles