డుప్లెసిస్‌ 96.. చెన్నై 170

Sun,May 5, 2019 05:55 PM

Du Plessis 96 Takes Chennai to 170

మొహాలి: కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ మెరుగైన స్కోరు సాధించింది. ఓపెనర్‌ డుప్లెసిస్‌(96: 55 బంతుల్లో 10ఫోర్లు, 4సిక్సర్లు), సురేశ్‌ రైనా(53: 38 బంతుల్లో 5ఫోర్లు, 2సిక్సర్లు) అర్ధశతకాలతో చెలరేగారు. మెరుపు ఆరంభం ల‌భించినా.. ఆఖర్లో వరుసగా వికెట్లు చేజార్చుకున్న చెన్నై 5 వికెట్లకు 170 పరుగులే చేయగలిగింది. ఐదో ఓవర్‌లోనే షేన్‌వాట్సన్‌ వెనుదిరగడంతో రైనాతో కలిసి డుప్లెసిస్‌ ఇన్నింగ్స్‌ను ముందుండి నడిపించాడు. జట్టును పటిష్ఠస్థితిలో నిలిపి బౌలర్లపై విరుచుకుపడ్డారు. రెండో వికెట్‌కు ఈ జోడీ 120 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఆఖరి ఓవర్లలో పంజాబ్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేశారు. చెన్నై సారథి ధోనీ 12 బంతుల్లో కేవలం 10 పరుగులు మాత్రమే చేసి నాటౌట్‌గా నిలిచాడు. పంజాబ్‌ బౌలర్లలో మహ్మద్‌ షమీ(2/17), శామ్‌ కర్రన్‌(3/35) అద్భుతంగా రాణించారు.

2387
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles