కోహ్లి చాలా పెద్ద ప్లేయర్.. అతనితో నన్ను పోల్చొద్దు!

Wed,February 13, 2019 03:10 PM

లాహోర్: సమకాలీన క్రికెట్‌లో విరాట్ కోహ్లియే అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏ ఫార్మాట్‌లో అయినా కోహ్లి గణాంకాలకు దగ్గరగా ఉన్న ప్లేయరే లేడు. అయితే జో రూట్, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్‌లాంటి ప్లేయర్స్‌ను తరచూ కోహ్లితో పోల్చి చూస్తుంటారు. నిలకడలో వాళ్లు విరాట్‌కు పోటీ ఇవ్వగలరు. ఇలాగే పాకిస్థాన్ టాపార్డర్ బ్యాట్స్‌మన్ బాబర్ ఆజంను కూడా కోహ్లితో పోలుస్తుంటారు. బాబర్ బ్యాటింగ్ ైస్టెల్ కోహ్లిని పోలి ఉంటుంది. అయితే అతడు మాత్రం తనను కోహ్లిలాంటి గొప్ప ప్లేయర్‌తో పోల్చొద్దని కోరుతున్నాడు. ఓ కార్యక్రమానికి హాజరైన బాబర్ ఆజంను కోహ్లితో పోలికపై కొందరు ప్రశ్నించారు. దీనిపై అతడు స్పందిస్తూ.. నన్ను తరచూ కోహ్లితో పోలుస్తుంటారు. కానీ అతడు చాలా గొప్ప ప్లేయర్. అతనికి దరిదాపుల్లో కూడా నేను లేను. నేనిప్పుడే నా కెరీర్‌ను ప్రారంభించాను. అతడు ఇప్పటికే చాలా సాధించేశాడు. అతనిలాగే నేను ఆడగలిగితే ఏదో ఒక రోజు కోహ్లి సాధించిన రికార్డులను సాధించాలని అనుకుంటున్నాను. అప్పుడు నన్ను అతనితో పోల్చండి కానీ ఇప్పుడు వద్దు అని బాబర్ అన్నాడు. పాకిస్థాన్ టీమ్ ఈ మధ్య సాధించిన విజయాల్లో బాబర్ కీలక పాత్ర పోషించాడు. వన్డేలు, టీ20ల్లో అతని సగటు 50కిపైనే ఉంది. వన్డేల్లో 8 సెంచరీలు కూడా చేశాడు. టెస్టుల్లో మాత్రం ఇంకా ఆ స్థాయిలో రాణించలేదు.


4260
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles