జొకోవిచ్ మ్యాచ్ టికెట్ రూ.1483 మాత్రమే..

Fri,June 3, 2016 01:50 PM

Djokovic on show for just USD 22

పారిస్: వంద మిలియన్ డాలర్ల ప్రైజ్‌మనీ గెలిచిన ఏకైక టెన్నిస్ ప్లేయర్‌గా రికార్డు సృష్టించిన వరల్డ్ నంబర్ వన్ జొకోవిచ్ ఆడే మ్యాచ్‌ను అతి తక్కువ ఖర్చుతో చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే పారిస్ ైఫ్లెట్ ఎక్కేయండి. ఎందుకంటే శుక్రవారం జొకోవిచ్ ఆడే సెమీస్ మ్యాచ్ టికెట్ ధరను కేవలం రూ.1483 (22 డాలర్లు)గా నిర్ణయించారు ఫ్రెంచ్ ఓపెన్ నిర్వాహకులు. భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న పారిస్‌లో మ్యాచ్‌లు చూసేందుకు అభిమానులు అంతగా ఆసక్తి చూపడం లేదు. గురువారం జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌లలో సగానికిపైగా సీట్లు ఖాళీగానే దర్శనమిచ్చాయి.
అటు షెడ్యూల్‌ను గాడిలో పెట్టేందుకు నిర్వాహకులు కూడా నానా తంటాలు పడుతున్నారు. ఎన్నడూలేని విధంగా తొలిసారి శుక్రవారం రోజే నాలుగు సెమీఫైనల్ మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. ఇందులో జొకోవిచ్ ఆడే సెమీస్ మ్యాచ్ సుజానె లెన్‌లెన్ అరెనాలో జరగనుంది. దీనికోసం ఒక్కో టికెట్ ధరను 22 డాలర్లుగా నిర్ణయించారు. ఇలా 8 వేల టికెట్లను అమ్మకానికి ఉంచారు. అయితే శని, ఆదివారాల్లో జరిగే వుమెన్స్, మెన్స్ ఫైనల్ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చే ఫిలిప్ చాట్రియర్ కోర్టులో మాత్రం టికెట్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ టికెట్లు రూ.42 వేలు(620 డాలర్లు), రూ.లక్ష (1483 డాలర్లు)కు అమ్ముడైపోయాయి. వరల్డ్ నంబర్ జొకోవిచ్ తన తొలి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్, సెరెనా 22 గ్రాండ్‌స్లామ్స్ రికార్డు సమం చేసే అవకాశాలు ఉండటంతో ఫైనల్ మ్యాచ్‌లకు డిమాండ్ భారీగా ఉంది.

2087
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles