రిష‌బ్‌ను వెన‌క్కి నెట్టేసిన దినేశ్ కార్తీక్‌

Mon,April 15, 2019 03:47 PM

హైద‌రాబాద్: వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో రెండ‌వ వికెట్ కీప‌ర్ ఎవ‌ర‌న్న దానిపై స్ప‌ష్టత వీడింది. ఇవాళ స‌మావేశ‌మైన సెలెక్ట‌ర్లు.. దినేశ్ కార్తీక్‌కే ఓటేశారు. రిజ‌ర్వ్ వికెట్ కీప‌ర్‌గా కార్తీక్ కొన‌సాగుతాడ‌ని సెలెక్ట‌ర్లు తెలిపారు. వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం అద‌నంగా న‌లుగురు మీడియం పేస్ బౌల‌ర్ల‌ను కూడా ఎంపిక చేసిన‌ట్లు చీఫ్ సెలెక్ట‌ర్ ఎంఎస్‌కే ప్ర‌సాద్ తెలిపారు. వికెట్ కీప‌ర్ దినేశ్ కార్తీక్‌కు . . ఎంఎస్‌కే ఫుల్ మార్క్స్ వేశారు. వ‌త్తిడిని ఎదుర్కోవ‌డంలో దినేశ్ దిట్ట అన్న అభిప్రాయాన్ని సెలెక్ట‌ర్లు వినిపించారు. వికెట్ కీపింగ్ చేసే సామ‌ర్థ్యం కూడా కార్తీక్‌కు మెండుగా ఉంద‌న్నారు. వాస్త‌వానికి ఈ స్థానం కోసం రిష‌బ్ పంత్ నుంచి గ‌ట్టి పోటీ వ‌చ్చింది. దూకుడుగా ఆడుతున్న పంత్‌ను తీసుకోవాలా లేదా అన్న సందేహంలో సెలెక్ట‌ర్లు ఉన్నారు. కానీ అనుభ‌వం, అద్భుత నైపుణ్యం ఉన్న దినేశ్ కార్తీక్‌ల‌కు సెలెక్ట‌ర్లు మొగ్గు చూపిన‌ట్లు తెలుస్తోంది. అయితే మ్యాచ్‌ల‌కు మాత్రం ధోనీనే వికెట్ కీపింగ్ చేస్తాడు. ఒక‌వేళ ధోనీకి గాయం అయితే .. అప్పుడు వికెట్ కీపింగ్ బాధ్య‌త‌ల‌ను దినేశ్ నిర్వ‌ర్తిస్తాడు. ఇవాళ ముంబైలో స‌మావేశ‌మైన సెలెక్ట‌ర్లు.. వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు 15 మంది స‌భ్యుల‌తో కూడిన టీమిండియాను ప్ర‌క‌టించారు. కేఎల్ రాహుల్ రిజ‌ర్వ్ ఓపెన‌ర్‌గా ఉంటాడ‌ని ఎంఎస్‌కే తెలిపారు. అవ‌స‌రాన్ని బ‌ట్టి.. రాహుల్‌ను వాడుకుంటామ‌న్నారు. హార్థిక్ పాండ్యా వెన్ను గాయం తీవ్రంగా లేద‌ని, కానీ ముంద‌స్తు జాగ్ర‌త్త‌గానే ఆస్ట్రేలియా సిరీస్‌ను దూరం పెట్ట‌నట్లు చీఫ్ సెలెక్ట‌ర్ చెప్పారు. ఆల్‌రౌండ‌ర్ విజ‌య్ శంక‌ర్‌ను కూడా వ‌ర‌ల్డ్‌క‌ప్ టీమ్‌కు ఎంపిక చేశారు.2377
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles