కార్తీక్ కళ్లు చెదిరే క్యాచ్ చూశారా.. వీడియో

Wed,February 6, 2019 03:33 PM

Dinesh Karthik takes a stunner in the first T20 against New Zealand

వెల్లింగ్టన్: టీమిండియా ప్లేయర్ దినేష్ కార్తీక్ న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో ఓ కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. కివీస్ ప్లేయర్ డారిల్ మిచెల్ కొట్టిన భారీ షాట్‌ను బౌండరీ దగ్గర అద్భుతంగా పట్టుకున్నాడు కార్తీక్. సిక్స్ వెళ్తుందనుకున్న బాల్‌ను అందుకున్న కార్తీక్.. బ్యాలెన్స్ తప్పడంతో బౌండరీ లైన్ అవతలికి వెళ్లాడు. అయితే అంతలోపే బాల్‌ను లోపలికి విసిరి మరోసారి డైవ్ చేసి పట్టుకున్నాడు. అయితే ఇదే మ్యాచ్‌లో కార్తీక్ రెండు ఈజీ క్యాచ్‌లను డ్రాప్ చేయడం విశేషం. న్యూజిలాండ్ వికెట్ కీపర్ సీఫర్ట్ 71 పరుగుల దగ్గర ఇచ్చిన సునాయాసమైన క్యాచ్‌ను కార్తీక్ అందుకోలేకపోయాడు. ఆ తర్వాత అలాంటిదే మరో క్యాచ్‌ను కూడా బౌండరీ దగ్గర అతడు డ్రాప్ చేశాడు.


1684
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles