HomeLATEST NEWSDinesh Karthik or Vijay Shankar, dilemma prevails for number 4 position

కార్తీకా.. శంక‌రా ? ఇంకా వీడ‌ని అయోమ‌యం

Published: Thu,June 13, 2019 01:32 PM
  Increase Font Size Reset Font Size decrease Font size   
హైద‌రాబాద్: కాసేప‌ట్లో నాటింగ్‌హామ్‌లో ఇవాళ కివీస్‌తో ఇండియా త‌ల‌ప‌డునున్న‌ది. ధావ‌న్ గాయంతో ఓపెన‌ర్ స్థానాన్ని కేఎల్ రాహుల్ కైవ‌సం చేసుకున్నాడు. మ‌రి నెంబ‌ర్ ఫోర్ స్థానంలో ఎవ‌రు వ‌స్తార‌న్న‌దే ఇప్పుడు అంతుచిక్క‌ని ప్ర‌శ్న‌. టీమ్ మేనేజ‌మెంట్ ఎవ‌రికి స్థానం క‌ల్పిస్తుందో వేచి చూడాల్సిందే. మ‌రి కాసేప‌ట్లో రెండు జట్లు టాస్‌కు వెళ్ల‌నున్నాయి. అయితే కీల‌క‌మైన నాలుగ‌వ నెంబ‌ర్ స్థానం కోసం కోహ్లీ సేన‌లో ఎవ‌రు చేరుతారో అన్న ఆస‌క్తి క‌లుగుతోంది. గాయ‌ప‌డ్డ గ‌బ్బ‌ర్ స్థానంలో స్టాండ్‌బైగా రిష‌బ్ పంత్ వెళ్లినా.. అత‌నేమీ మ్యాచ్ ఆడే ప్ర‌సక్తే లేదు. ఆల్ రౌండ‌ర్ విజ‌య్ శంక‌రా లేక స్పెష‌లిస్టు బ్యాట్స్‌మెన్ దినేశ్ కార్తీక్‌.. నెంబ‌ర్ ఫోర్ స్థానంలో బ్యాటింగ్‌కు దిగే అవ‌కాశాలు ఉన్నాయి. అయితే ప్ర‌స్తుతం నాటింగ్‌హామ్‌లో వాతావ‌ర‌ణం త‌డిగా ఉంది. అక్క‌డ రెండు రోజులుగా వ‌ర్షం కురుస్తోంది. పిచ్ ప‌రిస్థితి మీడియం పేస‌ర్ల‌కు అనుకూలించే విధంగా ఉంది. కివీస్‌తో మ్యాచ్‌లో విజ‌య్ శంక‌ర్‌కు అవ‌కాశం ఇస్తే బాగానే ఉంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్తం అవుతున్న‌ది. కానీ బ‌ల‌మైన బౌలింగ్ లైన‌ప్ ఉన్న కివీస్‌ను ఢీకొట్టాలంటే.. స్పెష‌లిస్టు బ్యాట్స్‌మెన్ దినేశ్ కార్తీక్ అవ‌స‌రం అన్న ఆలోచ‌న కూడా ఉన్న‌ది. ఇక మేనేమెంట్ నిర్ణ‌యం ఎలా ఉంటుందో.
2089
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology