కోచ్‌గా ఉచితంగా పనిచేస్తాను!

Tue,July 3, 2018 04:59 PM

సోచి(రష్యా): రష్యా వేదికగా జరుగుతున్న సాకర్ సమరంలో అగ్రశ్రేణి జట్టు అర్జెంటీనా నాకౌట్ దశలోనే ఇంటిముఖం పట్టిన విషయం తెలిసిందే. స్టార్ స్ట్రెకర్ లియోనెల్ మెస్సీ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవడంతో ఆ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెస్సీ అభిమానులు వరల్డ్ కప్ పోటీలో అర్జెంటీనా లేకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.కజాన్‌లో ఫ్రాన్స్‌తో జరిగిన పోరులో 4-3గోల్స్‌తో అర్జెంటీనా పరాజయం పాలైన విషయం తెలిసిందే. అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం డిగో మారడోనా కూడా ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ నిరాశవ్యక్తం చేశారు. అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టుకు కోచ్‌గా ఉచితంగా పనిచేస్తానని మారడోనా వెల్లడించారు. నేను డబ్బులు తీసుకోకుండానే కోచ్‌గా పనిచేస్తానని అన్నారు. అర్జెంటీనా ప్రస్తుత కోచ్ జార్జ్ సంపోలీ కాంట్రాక్టు 2022 వరకు ఉన్నప్పటికీ.. ఆ జట్టు కోచింగ్ బాధ్యతలు చేపట్టడానికి ఆసక్తిగా ఉన్నారా అని అడిగిన ప్రశ్నకు బదులుగా.. అవును, నేను ఉచితంగానే ఆ బాధ్యతలు నిర్వర్తిస్తా. తిరిగి వచ్చే క్రమంలో నేను ఏమీ ఆశించను. చాలా మంది అనుకుంటున్నారు నేను చాలా సంతోషంగా ఉన్నానని, కానీ నా హృదయం బాధతో బరువుగా ఉందని అర్జెంటీనా టోర్నీ నుంచి నిష్క్రమించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

2008 నుంచి 2010 వరకు మారడోనా అర్జెంటీనా జాతీయ జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరించాడు. అతని ఆధ్వర్యంలోని అర్జెంటీనా 2010 ప్రపంచకప్‌లో క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్లింది.

2393
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles