స్మిత్ చీట‌ర్‌.. అభిమానులకు కోహ్లీ క్లాస్‌

Mon,June 10, 2019 10:41 AM

Did not want Indian fans to set bad example, says Kohli on Smith being booed

హైద‌రాబాద్: వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో భాగంగా లండ‌న్‌లోని ఓవ‌ల్ మైదానంలో జ‌రిగిన మ్యాచ్‌లో కోహ్లీసేన 36 ర‌న్స్ తేడాతో ఆస్ట్రేలియాపై విజ‌యం సాధించింది. అయితే ఆ మ్యాచ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో.. స్టేడియంలోని భార‌త‌ అభిమానులు ఆస్ట్రేలియా ప్లేయ‌ర్ స్టీవ్ స్మిత్‌ను వేధించారు. మొద‌ట ఆస్ట్రేలియా ఫీల్డింగ్ చేస్తున్న స‌మ‌యంలో స్టేడియంలో ఓ వైపున ఉన్న భార‌తీయ అభిమానులు.. స్టీవ్ స్మిత్‌ను చూసి నినాదాలు చేశారు. చీట‌ర్‌, చీట‌ర్ అంటూ గ‌ట్టిగా అర‌వ‌డం మొద‌లుపెట్టారు. స్మిత్‌ను వేధించారు. అయితే ఆ స‌మ‌యంలో బ్యాటింగ్ చేస్తున్న కెప్టెన్ కోహ్లీ.. కేక‌లు చేస్తున్న అభిమానుల వైపు చూసి వారిని నివారించే ప్ర‌య‌త్నం చేశాడు. స్మిత్‌ను వేధించ‌వ‌ద్దు అంటూ ఫ్యాన్స్‌ను కోరాడు. ఇక ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తున్న స‌మ‌యంలోనూ మ‌ళ్లీ స్మిత్ వేధింపులు ఎదుర్కొన్నాడు. బ్యాటింగ్ కోసం పిచ్‌కు వ‌స్తున్న స‌మ‌యంలోనూ కొంద‌రు అభిమానులు స్మిత్ చీట‌ర్ అంటూ కేక‌లు వేశారు. అప్పుడు కూడా కోహ్లీ అభిమానుల వైపు చూసి వారిని కూల్ చేసే ప్ర‌య‌త్నం చేశాడు. మ్యాచ్ ముగిసిన త‌ర్వాత ఈ ఘ‌ట‌నల‌ గురించి ప్రెస్ కాన్ఫ‌రెన్స్‌లో వివ‌రించాడు. భార‌త అభిమాన‌లు చెడుగా ప్ర‌వ‌ర్తించ‌రాద‌న్న ఉద్దేశంతో ప్రేక్ష‌కుల‌ను వారించిన‌ట్లు కోహ్లీ చెప్పాడు.6029
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles