ధోనీ స్ట‌న్నింగ్ క్యాచ్‌ - వీడియో

Sat,October 27, 2018 02:16 PM

Dhoni took sensation catch in Pune ODI

పుణె : టీ20ల నుంచి ధోనీని ఎందుకు డ్రాప్ చేశారు ? ఈ ప్ర‌శ్న‌కు సెల‌క్ట‌రే స‌మాధానం ఇవ్వాలి. కానీ ఇవాళ వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో ధోనీ అందుకున్న క్యాచ్‌.. అత‌ని ఫిట్‌నెస్‌ను నిరూపిస్తున్న‌ది. మూడ‌వ వ‌న్డేలో బుమ్రా వేసిన బౌలింగ్‌లో హేమ్‌రాజ్ భారీ షాట్‌కు ప్ర‌య‌త్నించాడు. అయితే ఆ హుక్ షాట్ మిస్ టైమైంది. టాప్ హెడ్జ్ తీసుకున్న ఆ బంతి.. బ్యాక్‌వ‌ర్డ్ స్క్వేర్ లెగ్ దిశ‌గా గాలిలో ఎగిరింది. ఆ బంతిని అందుకునేందుకు .. మిస్ట‌ర్ కూల్ ధోనీ త‌న కీపింగ్ స్టాండ్స్ నుంచి ప‌రుగెత్తాడు. బంతి గాలిలోకి లేవ‌గానే.. దూసుకెళ్లిన ధోనీ.. అద్భుతంగా ఆ బంతిని క్యాచ్ ప‌ట్టాడు. గ్రౌండ్‌కు ప్యార‌ల‌ల్‌గా డైవ్ చేసిన అత‌డు.. అత్యంత క‌ష్ట‌మైన క్యాచ్‌ను.. అత్యంత సులువుగా అందుకున్నాడు. బాల్ గాల్లోకి లేవ‌గానే.. ధోనీ ఓ అథ్లెట్‌లా ప‌రుగెత్తాడు. త‌న కీపింగ్‌లో కానీ, ర‌న్నింగ్‌లో కానీ స‌త్తా త‌గ్గ‌లేద‌ని 37 ఏళ్ల ధోనీ ప్రూవ్ చేశాడు. మ‌రి సెలెక్ట‌ర్లు ఏమంటారో..3706
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles