కెప్టెన్‌గా ధోనీ.. రోహిత్‌కు రెస్ట్

Tue,September 25, 2018 04:35 PM

Dhoni takes the captaincy again as Afghanistan decided bat first against India

దుబాయ్: ఏషియాకప్‌లో భాగంగా తన చివరి సూపర్ 4 మ్యాచ్‌లో టీమిండియాపై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఆఫ్ఘనిస్థాన్. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మకు రెస్ట్ ఇవ్వడంతో మరోసారి టీమ్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు ధోనీ. అతడు 696 రోజుల తర్వాత మరోసారి టీమ్‌కు కెప్టెన్సీ వహిస్తుండటం విశేషం. ఈ మ్యాచ్‌తో పేస్‌బౌలర్ దీపక్ చహర్ వన్డే అరంగేట్రం చేస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో ఏకంగా ఐదు మార్పులతో బరిలోకి దిగుతోంది టీమిండియా. రోహిత్, ధావన్, భువనేశ్వర్, బుమ్రా, చాహల్‌కు రెస్ట్ ఇచ్చారు. ఇది ధోనీకి కెప్టెన్‌గా 200వ వ‌న్డే కావ‌డం విశేషం. కెప్టెన్సీ నుంచి త‌ప్పుకున్న త‌ర్వాత దాదాపు రెండేళ్ల‌కు మ‌రోసారి ధోనీ కెప్టెన్సీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించింది. ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్న ఐదుగురి స్థానంలో కేఎల్ రాహుల్‌, మ‌నీష్ పాండే, దీప‌క్ చ‌హ‌ర్‌, ఖ‌లీల్ అహ్మ‌ద్‌, సిద్ధార్థ్ కౌల్ టీమ్‌లోకి వ‌చ్చారు.


4388
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles