ధోనీ హాఫ్ సెంచ‌రీ

Sat,January 12, 2019 02:47 PM

Dhoni scores 68th ODI half century at Sydney

సిడ్నీ: మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీ.. సిడ్నీ వ‌న్డేలో హాఫ్ సెంచ‌రీ చేశాడు. టీ20, టెస్టుల‌కు దూరంగా ఉన్న ధోనీ.. ఇవాళ ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న మ్యాచ్‌లో అద్భుత ఆట‌ను ప్ర‌ద‌ర్శించాడు. వ‌న్డేల్లో 68వ అర్థ‌శ‌త‌కం చేసిన ధోనీ.. 51 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోర్ వ‌ద్ద ఎల్బీడబ్ల్యూ ఔట‌య్యాడు. ధోనీ ఇన్నింగ్స్‌లో మూడు బౌండ‌రీలు, ఓ సిక్స‌ర్ ఉన్నాయి. 289 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన భార‌త్ ఆరంభంలోనే 4 ప‌రుగుల‌కు మూడు వికెట్లు కోల్పోయింది. అయితే ఆ ద‌శ‌లో రోహిత్‌కు ధోనీ అండ‌గా నిలిచాడు. కూల్‌గా ఆడుతూ రోహిత్‌తో కీల‌క భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పాడు. ప్ర‌స్తుతం 37 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్ల‌కు భార‌త్ 159 ర‌న్స్ చేసింది.

2767
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles