బిగ్‌ఫైట్‌ ఆరంభం..ధోనీకి జ్వరం మ్యాచ్‌కు దూరం

Fri,April 26, 2019 07:40 PM

dhoni missing out a game for the second time this season, this time due to fever

చెన్నై: ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబయి ఇండియన్స్‌ మధ్య బిగ్‌ఫైట్‌ ఆరంభమైంది. టాస్‌ గెలిచిన చెన్నై తాత్కాలిక కెప్టెన్‌ సురేశ్‌ రైనా ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. జ్వరం కారణంగా ధోనీ ఈ మ్యాచ్‌కు విశ్రాంతి తీసుకున్నాడు. వెన్ను నొప్పితో బాధపడుతున్న మహీ సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌కు దూరమైన విషయం తెలిసిందే. ఈ ఏడాది సీజన్‌లో సొంతగడ్డపై ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో చెన్నై ఘన విజయాలు నమోదు చేసింది.

చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇప్పటికే ప్లే ఆఫ్‌ బెర్తు ఖాయం చేసుకోగా.. ముంబయి మరో రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తేనే టాప్‌-4కు అర్హత సాధిస్తుంది. ప్రస్తుతం 12 పాయింట్లతో ముంబయి మూడో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో చెన్నైపై ప్రస్తుత సీజన్‌లో మరోసారి విజయం సాధించి ప్లేఆఫ్‌ అవకాశాలను మరింత మెరుగుపరచుకోవాలని రోహిత్‌ సేన పట్టుదలగా ఉంది. ఆడిన 11 మ్యాచ్‌ల్లో ఎనిమిదింట్లో గెలుపొంది..పాయింట్ల పట్టికలో 16 పాయింట్లతో చెన్నై అగ్రస్థానంలో కొనసాగుతోంది. సీజన్‌లో వాంఖడేలో తొలిసారి తలపడిన మ్యాచ్‌లో చెన్నైని ముంబై మట్టికరిపించింది. ఈ నేపథ్యంలో ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని ధోనీసేన భావిస్తోంది.


3032
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles