ఉత్కంఠ‌భ‌రితంగా భార‌త్‌, కివీస్ మ్యాచ్‌

Wed,July 10, 2019 06:38 PM

Dhoni, Jadeja Rebuild for India

మాంచెస్ట‌ర్: న్యూజిలాండ్‌తో సెమీఫైన‌ల్ మ్యాచ్‌లో ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా దూకుడుగా ఆడుతున్నాడు. స్కోరు వేగం పెంచాల్సిన స‌మ‌యంలో జ‌డేజా ఝళిపిస్తున్నాడు. దీంతో భార‌త్ గెలుపుపై ఆశ‌లు వ‌దులుకున్న ఫ్యాన్స్‌కు ఒక్క‌సారిగా నమ్మ‌కం క‌లిగింది. వీరిద్ద‌రూ నిల‌క‌డ‌గా రాణిస్తుండంతో విజయంపై అభిమానుల్లో ఆశలు మొదలయ్యాయి. ఈ జోడీ ఆచితూచి ఆడుతూ బాధ్యతాయుతంగా ఆడటంతో ల‌క్ష్యాన్ని చేరుకుంటార‌ని అంతా భావించారు. ఈ ఇద్ద‌రు క‌లిసి 50కిపైగా ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. ఓవైపు ధోనీ స‌హ‌కారం అందిస్తుండ‌గా జడేజా ధాటిగా ఆడుతున్నాడు. సాంట్న‌ర్ వేసిన 39వ ఓవ‌ర్లో జ‌డ్డూ ఒక సిక్స‌ర్ బాది 10 ర‌న్స్ రాబ‌ట్టాడు. సాంట్న‌ర్‌ను జ‌డ్డూ ల‌క్ష్యంగా చేసుకొని భారీ షాట్లు ఆడుతున్నాడు. దీంతో సాధించాల్సిన ర‌న్‌రేట్ అంత‌రం త‌గ్గుతూ వ‌స్తోంది. 41 ఓవ‌ర్లు ముగిసేస‌రికి భార‌త్ 6 వికెట్ల‌కు 159 ప‌రుగులు చేసింది. జ‌డేజా(45), ధోనీ(27) క్రీజులో ఉన్నారు.

1710
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles