ధోనీ వయసు 20 కాదు.. అతనలా ఆడలేడు!

Mon,November 19, 2018 11:38 AM

Dhoni is not 20 and is not going to be 20 again says Kapil Dev

ముంబై: ధోనీ 20 ఏళ్ల యువకుడు కాదు.. అతనలా ఆడాలని కోరుకోవడం సరి కాదు. అతను ఇప్పటివరకు చాలా గొప్ప సేవలు అందించాడు.. అది చాలు అని టీమిండియాను తొలిసారి విశ్వ విజేతగా నిలిపిన మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నాడు. అతనికి అనుభవం ఉంది. అది టీమ్‌కు ఉపయోగడితే బాగుంటుంది. అయితే అతను మళ్లీ 20 ఏళ్ల వయసు వాడిలా ఆడటం కుదరదు అన్న విషయం అందరూ గుర్తుంచుకోవాలి. ధోనీ టీమ్‌కు అందుబాటులో ఉండి బాగా ఆడగలిగితే అతనో గొప్ప బలంగా భావించవచ్చు అని కపిల్ చెప్పాడు. ధోనీతోపాటు కోహ్లిని అంత ప్రత్యేకంగా నిలిపిన విషయం ఏంటి? రవిశాస్త్రి టీమిండియా కోచ్ పదవికి సరైన వ్యక్తేనే అన్న అంశాలపైనా కపిల్ స్పందించాడు.

మంచి టాలెంట్ ఉండి, కష్టపడే తత్వం ఉన్న వ్యక్తులు సూపర్‌హ్యూమన్‌గా నిలుస్తారని, కోహ్లి కూడా అలాంటి వ్యక్తేనని కపిల్ అన్నాడు. ఇక రవిశాస్త్రి కోచింగ్‌పై స్పందిస్తూ.. కెప్టన్, టీమ్ అతనితో సంతోషంగా ఉన్నపుడు మనం ఎందుకు ఎవరినైనా ప్రశ్నించాలి? నాకు సంబంధం లేని విషయాలపై నేను మాట్లాడను. టీమ్‌లో ఏం జరుగుతోందో తెలియకుండా స్పందించలేను.. టీమ్ అతనితో సంతోషంగా ఉన్నపుడు, విజయాలు సాధిస్తున్నపుడు అతనికి గుడ్‌లక్ చెప్పడం తప్ప ఏమీ అనలేమని కపిల్ స్పష్టం చేశాడు.

1441
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles