ధోనీ సిక్స‌ర్‌.. కోహ్లీ స్ట‌న్ - వీడియో

Mon,June 10, 2019 01:14 PM

Dhoni hits huge six in Starcs bowling, Virat Kohli stunned

హైద‌రాబాద్: ఆస్ట్రేలియా ప్ర‌ధాన బౌల‌ర్ మిచెల్ స్టార్క్‌. గ‌త వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో అత‌నే మ్యాన్ ఆఫ్ ద టోర్న‌మెంట్‌. ఈసారి కూడా విండీస్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో అయిదు వికెట్లు తీసి త‌న స‌త్తా చాటాడు. ఇండియాతో మ్యాచ్‌లోనూ ఆసీస్ ప్ర‌ధాన అస్త్రం అత‌నే. కానీ ఓవ‌ల్ మైదానంలో స్టార్క్‌కు మ‌నోళ్లు చుక్క‌లు చూపించారు. మిచెల్ వేసే అతి వేగ‌మైన బంతుల‌ను .. కోహ్లీ సేన ఊచ‌కోత కోసింది. అద్భుత‌మైన బౌలింగ్ చేసే స్టార్క్‌ను ఓవ‌ల్ పిచ్‌లో మ‌నోళ్లు ఉతికారేశారు. అయితే స్టార్క్ వేసిన 49వ ఓవ‌ర్ తొలి బంతిని ధోనీ సిక్స‌ర్ కొట్టాడు. అది మామూలు షాట్ కాదు. 143 కిలోమీట‌ర్ల వేగంతో వ‌చ్చిన ఆ బంతిని.. ధోనీ త‌న స్వింగ్ స్ట్రోక్‌తో ప్రేక్ష‌కుల్లోకి పంపేశాడు. నాన్ స్ట్ర‌యిక‌ర్ ఎండ్‌లో ఉన్న కెప్టెన్ కోహ్లీ ఆ షాట్‌ను చూసి స్ట‌న్ అయ్యాడు. స్టార్క్‌ బౌలింగ్‌లో ధోనీ సిక్స‌ర్ కొట్టిన తీరు క్రికెట్ ప్రేమికుల్ని థ్రిల్‌కు గురి చేసింది. ఇక మైదానంలోనే ఉన్న కోహ్లీ రియాక్ష‌న్ చూస్తే ఆ షాట్‌లో ఉన్న ద‌మ్మేందో తెలుస్తుంది. ధోనీ క‌న్నా ముందే.. కోహ్లీ కూడా స్టార్క్ బౌలింగ్ సూప‌ర్బ్ సిక్స‌ర్ కొట్టాడు. ఇన్‌సైడ్ ఔట్ స్టాండ్‌తో.. ఎక్స్‌ట్రా క‌వ‌ర్ మీదుగా సిక్స‌ర్ బాదాడు. కోహ్లీ త‌న క్లాస్ బ్యాటింగ్‌తో ప్రేక్ష‌కుల్ని థ్రిల్ చేశాడు. స్టార్క్ వేసిన 10 ఓవ‌ర్ల‌లో ఇండియా 74 ర‌న్స్ రాబ‌ట్టింది. హై స్కోరింగ్ థ్రిల్ల‌ర్‌లో ఇండియా 36 ప‌రుగుల తేడాతో నెగ్గింది. పాయింట్ల ప‌ట్టిక‌లో భార‌త్ ప్ర‌స్తుతం మూడ‌వ‌ స్థానంలో నిలిచింది.

7012
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles