కోహ్లికి ధోనీ గిఫ్ట్‌

Mon,January 23, 2017 02:12 PM

Dhoni gave a match ball after winning series, says Virat Kohli

కోల్‌క‌తా: వ‌న్డే టీమ్ కెప్టెన్‌గా తొలి సిరీస్ విజ‌యం అందుకున్న విరాట్ కోహ్లికి మాజీ కెప్టెన్ ధోనీ ఓ అరుదైన గిఫ్ట్ ఇచ్చాడు. ఈ విష‌యాన్ని కోహ్లియే ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పాడు. రెండో మ్యాచ్ గెలిచిన త‌ర్వాత తాను సంత‌కం చేసిన బాల్‌ను ధోనీ త‌న‌కు ఇచ్చాడ‌ని విరాట్ తెలిపాడు. కెప్టెన్‌గా సిరీస్ గెల‌వ‌డ‌మే కాదు బ్యాటింగ్‌లోనూ విరాట్ రాణించాడు. ఓ సెంచ‌రీ, హాఫ్ సెంచ‌రీ చేశాడు. తొలి సిరీస్ విజ‌యం ఎప్పటికీ మ‌ధుర జ్ఞాప‌కంగా మిగిలిపోతుంద‌ని చెప్పిన ధోనీ.. త‌న‌కు బాల్ ప్రెజెంట్ చేశాడ‌ని బీసీసీఐకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో కోహ్లి చెప్పాడు. రెండో మ్యాచ్ ముగిసిన త‌ర్వాత ఎంఎస్ నాకు మ్యాచ్ బాల్ ఇచ్చాడు.

ఈ రోజుల్లో స్టంప్స్ చాలా ఖరీదైన‌వి మారాయి. అందుకే వాటిని ఇంటికి తీసుకెళ్ల‌నీయ‌డం లేదు అని విరాట్ న‌వ్వుతూ చెప్పాడు. సిరీస్ గెల‌వ‌డ‌మే కాదు ధోనీ ఆటోగ్రాఫ్ ఉన్న బాల్‌ను అందుకోవ‌డం కూడా నాకు ప్ర‌త్యేక‌మే అని విరాట్ అన్నాడు. సిరీస్ విజ‌యంలో టీమ్ సభ్యులంద‌రి పాత్ర ఉంద‌ని తెలిపాడు. వ‌చ్చిన అవ‌కాశాన్ని అంద‌రూ అందిపుచ్చుకున్నార‌ని, ఇంత‌కు మించి కెప్టెన్‌గా త‌న‌కు ఇంకేం కావాల‌ని విరాట్ అన్నాడు. ముఖ్యంగా కేదార్ జాద‌వ్‌, హార్దిక్ పాండ్యాల‌పై కోహ్లి ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు.

3600
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles