ధోనీ మారిపోయాడు.. టీమ్‌ను గెలిపించేంత సీన్ లేదు!

Wed,November 22, 2017 04:19 PM

Dhoni depending on others to win matches says Former cricketer Sanjay Manjrekar

ముంబై: టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ రిటైర్మెంట్‌పై మరో మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ నోరు విప్పాడు. ధోనీ ఆటతీరును తప్పుబడుతూ ఎందరో మాజీలు ఇప్పటికే అతని రిటైర్మెంట్‌ను డిమాండ్ చేసి విమర్శల పాలైన విషయం తెలిసిందే. అయినా మంజ్రేకర్ మాత్రం వెనుకడుగు వేయలేదు. దీనిపై చర్చ జరిగితే తప్పేంటి అని ప్రశ్నిస్తున్నాడు. టీమ్ బయట ఉన్న ఓ యువ ఆటగాడు ధోనీ కంటే బాగా ఆడుతున్నాడు.. అతని కంటే టీమ్‌కు ఎక్కువ చేయగలడు అనుకుంటే అది కచ్చితంగా చర్చించాల్సి అంశమే. ఇందులో కోపతాపాలకు తావులేదు. ఇది ఆటకు మంచి చేస్తుంది అని మంజ్రేకర్ స్పష్టంచేశాడు. ఈ మధ్య వన్డేలు, టీ20ల్లో ధోనీ రికార్డులను ఈ సందర్భంగా అతను ప్రస్తావించాడు. ధోనీ గత 25 వన్డేల్లో 56.75 సగటు, 81.94 ైస్ట్రెక్ రేట్ నమోదు చేశాడు. పది టీ20ల్లో 33.80 సగటుతో 131.01 ైస్ట్రెక్‌రేట్ ఉంది అని మంజ్రేకర్ చెప్పాడు. పైకి చూడటానికి ఇవి అద్భుతమైన గణాంకాలుగానే కనిపిస్తున్నాయి. ఇలాంటి గణాంకాలే ఓ యువ ఆటగాడు నమోదు చేస్తే ఆటోమెటిగ్గా టీమ్‌లోకి తీసుకుంటారు.

కానీ మంజ్రేకర్ మాత్రం ధోనీలో వచ్చిన మార్పు గురించి చెబుతున్నాడు. ఈ గణాంకాలను క్షుణ్నంగా పరిశీలిస్తే అతని ప్రదర్శనలో ఉన్న అసలు విషయం బయటపడుతుంది. గతంలో ఉన్నట్లు అతను ఇప్పుడు ఓ గేమ్ చేంజర్ కాదు అని మంజ్రేకర్ అన్నాడు. ఇప్పుడు మ్యాచ్‌లు గెలిపించడానికి ధోనీ ఇతరులపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాడని అతనన్నాడు. ధోనీ బ్యాటింగ్‌లో వచ్చిన మార్పు ఒక్కటే. గతంలో ఆరు బాల్స్‌లో 4 సిక్సర్లు కొట్టగలిగే అతడు.. ఇప్పుడు ఒక్కటి మాత్రమే కొట్టగలుగుతున్నాడు. మ్యాచ్‌లు గెలిపించడానికి ఇతరులపై ఆధారపడుతున్నాడు అని మంజ్రేకర్ అన్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో అవసరమైన వేగంతో పరుగులు చేయడంలో ధోనీ విఫలమవడంతో అతనిపై విమర్శలు ఎక్కువయ్యాయి. మాజీ క్రికెటర్లు లక్ష్మణ్, అగార్కర్, ఆకాశ్ చోప్రాలాంటి వాళ్లు టీ20ల్లో ధోనీ స్థానాన్ని ప్రశ్నించిన విషయం తెలిసిందే.

4418
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles