కూతురితో కలిసి ధోనీ డ్యాన్స్.. వైరల్ వీడియో

Mon,December 3, 2018 03:31 PM

Dhoni dances with daughter Ziva video goes viral

రాంచీ: టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీకి ఎంత ఫాలోయింగ్ ఉందో.. అతని కూతురు జివాకు కూడా సోషల్ మీడియాలో అదే స్థాయి ఫాలోయింగ్ వస్తున్నది. ఇప్పటికే ఆమెకు సంబంధించిన ఎన్నో వీడియోలను ధోనీ, అతని భార్య సాక్షి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తాజాగా ధోనీ ఆమెతో కలిసి చేస్తున్న డ్యాన్స్ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది. మూడేళ్ల జివా వేసిన కొన్ని అద్భుతమైన స్టెప్పులు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ధోనీకి ఎలా డ్యాన్స్ చేయాలో ఆమె నేర్పించడం విశేషం. ప్రస్తుతం టీమిండియా ఆస్ట్రేలియాలో ఉండగా.. ధోనీ కూడా వన్డే సిరీస్ కోసం వచ్చే ఏడాది జనవరిలో అక్కడికి వెళ్లనున్నాడు. అతడు ఇప్పటికే టెస్టుల నుంచి రిటైరవగా.. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చారు. దీంతో నేరుగా వన్డే సిరీస్ కోసమే ధోనీ ఆస్ట్రేలియా వెళ్తాడు.

1230
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles