ఐపీఎల్‌లో 'ఢిల్లీ డేర్‌డెవిల్స్' పేరు మార్పు..!

Tue,December 4, 2018 06:15 PM

Delhi Daredevils renamed Delhi Capitals for IPL 2019

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) చరిత్రలో అత్యంత చెత్త ట్రాక్ రికార్డు ఉన్న జట్టంటే ముందుగా గుర్తొచ్చేది ఢిల్లీ డేర్‌డెవిల్స్. ఏ సీజన్‌లోనూ ఆ జట్టు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. జట్టులో ప్రపంచస్థాయి ఆటగాళ్లున్నా వరుస మ్యాచ్‌ల్లో ఓడిపోతుంటుంది. ఓ సీజన్‌లో వరుసగా తొమ్మిది మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. గతేడాది సీజన్‌లో తొలి 12 మ్యాచ్‌ల్లో కేవలం మూడింటిలోనే విజయం సాధించింది. చాలా సీజన్లలో ఆ టీమ్ పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంతోనే సరిపెట్టుకునేది. అభిమానులు కూడా ఎంతో మద్దతుగా నిలిచినా ఢిల్లీకి అదృష్టం కలిసిసొచ్చిదికాదు.

ఐతే ఫ్రాంఛైజీ పేరులోనే దోషం ఉందని ఆ పేరును మారిస్తే తప్పక ప్రయోజనం ఉంటుందని గత సీజన్‌లో చాలా మంది అభిమానులు సోషల్‌మీడియాలో వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. డీడీకి తమదైన శైలిలో మారు పేర్లు కూడా పెట్టేశారు. ఇదే నిజమని భావించిందేమో తెలియదు కానీ తాజాగా ఢిల్లీ డేర్‌డెవిల్స్ పేరును ఆ యాజమాన్యం మార్చింది. 2019 సీజన్‌లో 'ఢిల్లీ కాపిటల్స్'(డీసీ)గా బరిలో దిగనున్నట్లు ఫ్రాంఛైజీ ప్రకటించింది. జెర్సీ కలర్‌తో పాటు లోగోలో కూడా మార్పులుంటాయని తెలిపింది. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ప్రధాన కోచ్‌గా ఉంటారని.. మహ్మద్ కైఫ్ సహాయకుడిగా వ్యవహరిస్తారని చెప్పింది. 2019 సీజన్‌లోనైనా ట్రోఫీ నెగ్గాలని ఆశిస్తోంది.4933
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles