కోల్‌కతాపై టాస్ గెలిచిన గంభీర్Mon,April 16, 2018 07:48 PM

Delhi Daredevils have won the toss and have opted to field


కోల్‌కతా:ఐపీఎల్-11లో సొంతగడ్డపై ఆడిన తొలి మ్యాచ్‌లోనే గెలిచి కోల్‌కతా నైట్ రైడర్స్ శుభారంభం చేసింది. ఆ తరువాత జరిగిన రెండు మ్యాచ్‌ల్లో వరుసగా పరాజయం పాలై ఢీలా పడింది. సోమవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ గౌతం గంభీర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఏడేళ్ల పాటు కోల్‌కతాకు ప్రాతినిధ్యం వహించిన గౌతీ ప్రస్తుతం ఢిల్లీకి నాయకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో పోరు కోల్‌కతా వర్సెస్ గంభీర్ మధ్యేనని క్రీడా విశ్లేషకులతో పాటు అభిమానులు భావిస్తున్నారు. కోల్‌కతా పరిస్థితులపై గంభీర్‌కు అపారమైన అనుభవం ఉందని కేకేఆర్ సహాయ కోచ్ కూడా అభిప్రాయపడిన విషయం తెలిసిందే. గంభీర్‌సేను ఎదుర్కోవడం దినేశ్ కార్తీక్ జట్టుకు పెద్ద సవాలే. ముంబయి ఇండియన్స్‌పై ఉత్కంఠ పోరులో ఆఖరి బంతికి విజయం సాధించిన ఢిల్లీ మరో అద్భుత ప్రదర్శన చేయాలని ఆత్రుతగా ఉంది. కేకేఆర్ జట్టులో మిచెల్ జాన్సన్ స్థానంలో టామ్ కర్రన్ రాగా.. ఢిల్లీ టీమ్‌లో డేనియల్ క్రిష్టియన్ స్థానంలో క్రిస్ మోరీస్ తుది జట్టులోకి వచ్చారు.821
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS