ధావన్‌ ధనాధన్‌.. చెన్నై టార్గెట్‌ 148

Tue,March 26, 2019 09:49 PM

Delhi Capitals vs Chennai Super Kings Capitals End at 147/6

న్యూఢిల్లీ: ఐపీఎల్‌-12లో భాగంగా ఫిరోజ్‌ షా కోట్ల మైదానంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 147 పరుగులు చేసింది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌(51: 47 బంతుల్లో 7ఫోర్లు) అర్థశతకంతో రాణించడంతో ఢిల్లీ ఆమాత్రం స్కోరు సాధించింది. భారీ స్కోరు సాధించాల్సిన సమయంలో బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేయడంతో ఢిల్లీ తక్కువ స్కోరుకే పరిమితమైంది.

ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే దూకుడుగా ఆడుతున్న యువ ఓపెనర్‌ పృథ్వీ షా(24) జట్టు స్కోరు 36 వద్ద ఔటయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌.. మరో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌కు సహకరించాడు. కష్టాల్లో ఉన్న జట్టు ఇన్నింగ్స్‌ను వీరిద్దరూ సరిదిద్దారు. కీలక సమయంలో అద్భుతమైన బంతితో శ్రేయాస్‌ను ఇమ్రాన్‌ తాహిర్‌ ఎల్బీగా పెవిలియన్‌ పంపాడు. ఆ తర్వాత ప్రమాదకరంగా మారుతున్న రిషబ్‌ పంత్‌(25).. బ్రావో వేసిన భారీ షాట్‌ ఆడి..బౌండరీ లైన్‌ వద్ద శార్దుల్‌ ఠాకూర్‌ చేతికి చిక్కాడు.

15.2ఓవర్లకే 120 పరుగులు చేసి ఢిల్లీ పటిష్ఠస్థితిలో ఉంది. అప్పటికి కేవలం 3 వికెట్లు చేజార్చుకున్న ఢిల్లీ తర్వాతి ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోయింది. క్రీజులో కుదురుకున్న ధావన్‌ వేగంగా ఆడే క్రమంలో డ్వేన్‌ బ్రావో వేసిన 18వ ఓవర్‌ తొలి బంతికే వెనుదిరిగాడు. దీంతో భారీ స్కోరు చేసే అవకాశాన్ని ఢిల్లీ చేజార్చుకుంది. మరోవైపు ఆఖరి ఓవర్లలో చెన్నై బౌలర్లు ధాటిగా బౌలింగ్‌ చేశారు. కీలక సమయాల్లో వికెట్లు తీసి స్కోరు వేగానికి కళ్లెం వేశారు. బ్రావో(3/33) గొప్పగా బంతులేశాడు. దీపక్‌ చాహర్‌, జడేజా, తాహిర్‌ తలో వికెట్‌ తీశారు.

2968
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles