నిన్నటి సూపర్ ఇన్నింగ్స్ చెన్నై ఫ్యాన్స్‌కు అంకితం

Sun,April 8, 2018 03:33 PM

Dedicate my performance to Chennai fans, says Dwayne Bravo


ముంబయి: ఇండియన్ ప్రీమియల్ లీగ్(ఐపీఎల్)-11లో రెండేళ్ల నిషేధం తరువాత బరిలోకి దిగిన తొలి మ్యాచ్‌లోనే ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించి వారెవ్వా అనిపించింది. హోరాహోరీగా సాగిన పోరులో ఒంటిచేత్తో పోరాడిన డ్వేన్ బ్రావో(68 30 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లు) బౌండరీలతో విరుచుకుపడి చెన్నైకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. జట్టు ఓటమి ఖాయమని కెప్టెన్ ధోనీ సైతం ముందుగానే ఊహించాడు. అలాంటి స్థితి నుంచి ఒత్తిడిని జయించి ముంబయిని దాని సొంత గడ్డపైనే మట్టికరిపించి టోర్నీని ఘనంగా ఆరంభించించి అభిమానులకు కొత్త జోష్ అందించింది.

మ్యాచ్‌లో గొప్ప ప్రదర్శన చేసిన బ్రావో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న తరువాత మాట్లాడాడు. ఇది జట్టు గొప్ప ప్రయత్నం. ఈ విజయాన్ని చెన్నై అభిమానులకు అంకితం చేయాలనుకుంటున్నా. ఇలాంటి మధుర క్షణాల కోసం వారు ఎన్నో రోజులుగా వేచి చూశారు. తనవంతుగా మ్యాచ్ గెలుపు ప్రదర్శన చేసినందుకు చాలా సంతోషంగా ఫీలవుతున్నా అని బ్రావో చెప్పాడు. 166 పరుగుల లక్ష్యాన్ని చెన్నై 19.5 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

2380
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles