శభాష్ కోహ్లీ.. దిగ్గజాల ప్రశంసలు

Mon,June 10, 2019 01:50 PM

Darren Lehmann lauds Virat Kohli as India captain stops fans from booing Steve Smith

లండన్: ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ గొప్ప పరిణతి చూపించాడని దిగ్గజ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతర్జాతీయ మ్యాచ్‌లో క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించి అందరికీ ఆదర్శంగా నిలిచాడని కొనియాడుతున్నారు. సోషల్ మీడియాలో విరాట్‌ను అభినందిస్తూ నెటిజన్లు పోస్ట్‌లు, ట్వీట్లతో హోరెత్తించారు. ఆస్ట్రేలియా మాజీ కోచ్ డారెన్ లీమ‌న్‌, మాజీ క్రికెటర్లు మైఖేల్ వాన్, ఆకాశ్ చోప్రా త‌ద‌త‌రులు అభినంద‌న‌లు తెలుపుతున్నారు.

భారత్ ఇన్నింగ్స్‌లో డీప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను టార్గెట్ చేసిన అభిమానులు చీటర్..చీటర్ అంటూ హేళన చేశారు. దీన్ని గమనించిన విరాట్.. డ్రింక్స్ బ్రేక్‌లో బౌండరీ సమీపం వరకు వెళ్లి వాళ్లను మందలించాడు. అతన్ని విమర్శించడం ఆపి చప్పట్లతో మద్దతు పలకాలని సూచించాడు. దీన్ని గమనించిన స్మిత్.. కోహ్లీకి షేక్‌హ్యాండ్ కూడా ఇచ్చాడు.


6862
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles