ఆల్‌రౌండ‌ర్‌ గుణతిలకపై ఆరు మ్యాచ్‌ల నిషేధం

Fri,July 27, 2018 03:02 PM

కొలంబో: శ్రీలంక ఆల్‌రౌండ‌ర్‌ ధనుష్క గుణతిలకపై శ్రీలంక క్రికెట్ బోర్డు వేటు వేసింది. ఆరు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడకుండా అతడిపై నిషేధం విధించింది. ప్లేయర్ కోడ్ ఆఫ్ కండక్ట్, కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ ఉల్లంఘించడంతో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. కొలంబోలో సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్టు సందర్భంగా అతడి చర్యలను తీవ్రంగా పరిగణించింది. ఆ టెస్టుకు సంబంధించి అతడికి ఎలాంటి ఫీజులు కూడా చెల్లించ‌లేద‌ని ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.


మొత్తం ఆరు మ్యాచ్‌ల నిషేధంలో తాజా ఉల్లంఘన కారణంగా మూడింటిలో వేటు వేయగా.. అక్టోబర్ 18, 2017లో ప్లేయర్ కాంట్రాక్టును ఉల్లంఘించిన ఏడాదిలోపే మరోసారి నిబంధనలు అతిక్రమించిన నేపథ్యంలో మరో మూడు మ్యాచ్‌ల్లో సస్పెన్షన్ ఎదుర్కొన్నాడు.

టీమ్ బసచేసిన హోటల్‌లో గుణతిలక స్నేహితుడొకరు నార్వే మహిళపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. గుణతిలక గదిలోనే ఈ ఘటన జరిగిన నేపథ్యంలో పోలీసులు అతడిని విచారించారు. నా మిత్రుడు, నార్వే మ‌హిళ మ‌ధ్య ఏం జ‌రిగిందో త‌న‌కు తెలియ‌ద‌ని ఆ స‌మ‌యంలో నిద్రపోతున్నానని విచారణలో పోలీసులకు తెలిపాడు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన శ్రీలంక క్రికెట్ జాతీయ పాలకమండలి 27ఏళ్ల గుణతిలకపై దర్యాప్తునకు ఆదేశించింది. శ్రీలంక జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ప్రవర్తనా నియమావళిని అతడు పదేపదే ఉల్లంఘించడం పెద్ద సమస్యగా మారిందని, దీంతో ఈసారి కఠిన చర్యలు తీసుకుంది.

1079
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles