గంగూలీకే ధైర్యం చెప్పిన బౌలర్ అతడు!

Fri,November 3, 2017 11:46 AM

న్యూఢిల్లీ: ఇండియన్ క్రికెట్‌లో డేరింగ్ అండ్ డాషింగ్ కెప్టెన్‌గా గంగూలీకి ఉన్న పేరు తెలిసిందే. కొత్త రక్తాన్ని టీమ్‌లో నింపి దూకుడు నేర్పిన కెప్టెన్ అతడు. అలాంటి వ్యక్తికే ధైర్యం చెప్పిన ఘనత ఆశిష్ నెహ్రాది. ఈ మధ్యే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఈ ఢిల్లీ బౌలర్‌ను ఆకాశానికెత్తాడు అతనితో కలిసి ఆడిన మాజీ క్రికెట‌ర్‌ హేమంగ్ బదాని. నెహ్రా గురించి చెబుతూ ఓ ఆసక్తికర విషయాన్ని అతను వెల్లడించాడు. 2004లో ఇండియా పాకిస్థాన్ టూర్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. ఆ సిరీస్‌లోని ఓ వన్డే మ్యాచ్‌లో ఇండియా 350 రన్స్ భారీ స్కోరు చేసింది. కానీ పాకిస్థాన్ అంతటి టార్గెట్‌ను కూడా చేజ్ చేసేలా కనిపించింది. చివరి ఓవర్లో 9 పరుగులు చేయాల్సిన పరిస్థితి. ఈ సమయంలో ఎవరు బౌలింగ్ చేయాలో తెలియని గందరగోళం. ఈ పరిస్థితుల్లో కెప్టెన్ దగ్గరకు వెళ్లిన నెహ్రా.. దాదా.. నువ్వు భయపడకు.. నేను వేస్తా చివరి ఓవర్ అని నెహ్రా బాల్‌ను అందుకున్నాడట. ఈ విషయాన్ని బదానియే చెప్పాడు. చివరి ఓవర్లో సెట్ బ్యాట్స్‌మన్ మోయిన్ ఖాన్ వికెట్ తీయడంతోపాటు కేవలం 3 పరుగులే ఇచ్చి టీమ్‌ను గెలిపించాడు నెహ్రా. ఇండియన్ టీమ్ తరఫున ఆడిన బెస్ట్ లెఫ్టామ్ పేసర్లలో నెహ్రా ఒకడని ఈ సందర్భంగా బదాని అన్నాడు. తన ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా నెహ్రాకు ఓ వీడియో సందేశాన్ని అతను ఇచ్చాడు.


4819
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles