చెపాక్‌లో హై ఓల్టేజ్‌ మ్యాచ్‌

Tue,April 23, 2019 06:30 PM

CSK aim to sort out top-order woes, Sunrisers look for middle-order solace

చెన్నై: ఐపీఎల్‌-12 సీజన్‌లో చెపాక్‌ మైదానంలో మరో బ్లాక్‌బస్టర్‌ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. చెన్నై సూపర్‌ కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లు ఈ రోజు రాత్రి 8 గంటలకు తలపడనున్నాయి. ప్రస్తుత సీజన్‌లో సీఎస్‌కే సారథి ధోనీ సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. కీలక సమయంలో అనూహ్య బ్యాటింగ్‌తో ఒంటి చేత్తో పరుగుల సునామీ సృష్టిస్తున్నాడు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో మ్యాచ్‌లో మెరుపు బ్యాటింగ్‌తో ధోనీ అలరించాడు. మరోవైపు సన్‌రైజర్స్‌ ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌(517), జానీ బెయిర్‌స్టో(445) కూడా అద్భుతంగా రాణిస్తున్నారు. జట్టు విజయాల్లో వీరిద్దరిదే కీలక పాత్ర. బౌలింగ్‌ విభాగం కూడా అన్ని జట్ల కన్నా బలంగా ఉంది.

చెన్నై టాప్‌-3 ఆటగాళ్ల వైఫల్యంతోనే చెన్నై గత రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. బౌలర్లు ప్రత్యర్థి జట్టును కట్టడి చేస్తూ మెరుగైన ప్రదర్శన చేస్తున్నారు. అలాగే సన్‌రైజర్స్‌ మిడిలార్డర్‌ టీమ్‌ను కలవరపెడుతోంది. టాప్‌ ఆర్డర్‌ విఫలమైతే.. గట్టిగా నిలబడి ఆదుకునే వారు లేకపోవడం ఆ జట్టును ఇబ్బందిపెడుతోంది. ఇరుజట్లు తమ తమ విభాగాల్లో చేస్తున్న తప్పిదాలను సరిదిద్దుకోవాలని చూస్తున్నాయి. గత రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన సన్‌రైజర్స్‌ ఉత్సాహంతో ఉండగా.. వరుస ఓటములతో చెన్నై జోరు కొంత మేర తగ్గింది. ఒక మ్యాచ్‌లో గెలిస్తే ధోనీసేన ప్లేఆఫ్‌ బెర్తు ఖాయం చేసుకుంటుంది. అలాగే హైదరాబాద్‌తో గత మ్యాచ్‌లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని కూడా భావిస్తోంది. ఈ నేపథ్యంలో పోరు రసవత్తరంగా సాగనుంది.

2783
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles