ఇంగ్లండ్‌కు షాక్.. ఫైనల్లో క్రొయేషియా

Thu,July 12, 2018 07:03 AM

croatia defeats england in semi final and reaches final in fifa world cup 2018

సెయింట్ పీటర్స్‌బర్గ్: ఫిఫా ప్రపంచకప్ 2018 ఆద్యంతం రసవత్తరంగా సాగుతున్నది. క్రొయేషియా ఫైనల్ చేరింది. లుజ్నికీ స్టేడియంలో జరిగిన సెమీఫైనల్ పోరులో ఇంగ్లండ్‌పై 2-1 గోల్ఫ్ తేడాతో క్రొయేషియా విజయం సాధించింది. దీంతో తొలిసారి ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ చేరిన జట్టుగా క్రొయేషియా రికార్డు సృష్టించింది. ఇక.. ఈ ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో క్రొయేషియా.. ఫ్రాన్స్‌తో ఢీకొననుంది.

ఫస్ట్ హాఫ్ లో ఇంగ్లండ్ దూకుడుగా ఆడింది. మ్యాచ్ మొదలైన 5వ నిమిషంలో కైరాన్ ట్రిప్పిర్ కొట్టిన ఫ్రీకిక్ గింగిరాలు తిరుగుతూ టాప్ కార్నర్ నుంచి క్రొయేషియా గోల్‌పోస్ట్‌లోకి దూసుకెళ్లింది. మధ్యలో ఆటగాళ్లు అడ్డుగోడలా నిలబడినా.. ప్రత్యర్థి గోలీ సుబాసిచ్ అమాంతం గాల్లోకి ఎగిరినా బంతిని అడ్డుకోలేకపోయాడు.

ట్రిప్పిర్‌కు అంతర్జాతీయ టోర్నీల్లో ఇదే తొలి గోల్ కావడం విశేషం. 2006 తర్వాత వరల్డ్‌కప్‌లో ఫ్రీకిక్‌ను గోల్‌గా మలిచిన తొలి ప్లేయర్‌గా ట్రిప్పిర్ రికార్డులకెక్కాడు. గతంలో డేవిడ్ బెక్‌హమ్ ఈక్వెడార్‌పై ఈ ఘనత సాధించాడు. స్వీడన్, కొలంబియాతో ఆడిన జట్టును యధావిధిగా దించి కోచ్ సౌత్‌గేట్ అందర్ని ఆశ్చర్యానికి లోను చేశాడు. 30వ నిమిషంలో గోల్‌పోస్ట్ అంచుల వద్ద హ్యారీకేన్ కొట్టిన షాట్ రీబౌండ్ అయి బయటకు వెళ్లింది. మ్యాచ్ ముందుకుసాగే కొద్ది క్రొయేషియా డిఫెన్స్ అంత అనుకూలంగా కదల్లేదు. దీంతో తొలి అర్ధభాగం ముగిసేసరికి ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.

కానీ సెకండ్ హాఫ్ లో సీన్ మారింది. క్రొయేషియా ప్లేయర్ పిరిసిక్ ఆట 68వ నిమిషంలో గోల్ చేసి స్కోర్ ను సమం చేశాడు. ఇక మ్యాచ్ ఎక్స్ ట్రా టైమ్ కు వెళ్లింది. ఆ సమయంలో ఇంగ్లండ్ కు షాకిచ్చింది క్రొయేషియా. 109వ నిమిషంలో మండూకిక్ గోల్ చేసి ఇంగ్లండ్ ను ఇంటికి పంపాడు. వరల్డ్ కప్ ఫైనల్లో ప్రవేశిస్తుందనుకున్న ఇండ్లండ్ కు ఊహించని షాక్ తగిలింది.

2010
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles