
లండన్: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే కదా. కేవలం 54 బాల్స్‌లో 101 రన్స్ చేయడంతో 160 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా సునాయాసంగా ఛేదించింది. అయితే సెంచరీ తర్వాత రాహుల్ సెలబ్రేట్ చేసుకున్న తీరు చాలా మంది దృష్టిని ఆకర్షించింది. తాను సెలబ్రేట్ చేసుకోవడమే కాదు.. తర్వాత అతవలి ఎండ్‌లో ఉన్న కోహ్లితోనూ అలాగే చేశాడు. అయితే ఈ ైస్టెల్లో సంబురాలు చేసుకోవడం తాను పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డోను చూసే నేర్చుకున్నట్లు రాహుల్ చెప్పాడు. మ్యాచ్ తర్వాత దినేష్ కార్తీక్‌తో మాట్లాడుతూ రాహుల్ ఈ విషయాన్ని చెప్పాడు. తానెప్పుడూ హార్దిక్ పాండ్యాకు హ్యాండ్ షేక్ ఇలాగే ఇస్తానని, ఇంగ్లండ్ టూర్ ముగిసేలోపు టీమ్‌లో ఉన్న అందరితోనూ ఇలాగే చేస్తానని రాహుల్ అన్నాడు. రొనాల్డోకు కోహ్లి పెద్ద అభిమాని అని కూడా ఈ సందర్భంగా రాహుల్ చెప్పాడు.