ప్రేయసిని పెళ్లాడిన క్రికెటర్ సంజూ శాంసన్..!

Sat,December 22, 2018 02:50 PM

Cricketer Sanju Samson ties the knot with classmate

తిరువనంతపురం: యువ క్రికెటర్ సంజు శాంసన్ ఓ ఇంటివాడయ్యాడు. శనివారం తిరువనంతపురానికి సమీపంలో గల కోవలెమ్‌లోని రిసార్ట్‌లో ప్రేయసి చారులతను కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య వివాహం చేసుకున్నాడు. వెడ్డింగ్ రిసెప్షన్ ఇవాళ సాయంత్రం జరగనుంది. తిరువనంతపురంలోని ఓ కళాశాలలో కొన్నేళ్ల క్రితం వీరిద్దరూ కలిసి చదువుకున్నారు. గ్రాడ్యుయేషన్‌లో వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. అలా వారిద్దరి మధ్య మొదలైన స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఇరుకుటుంబాల పెద్దలు అంగీకరించడంతో ఇవాళ ఉదయం ఒక్కటయ్యారు. కేవలం 30 మంది అతిథుల సమక్షంలో నిరాడంబరంగా పెళ్లిచేసుకున్నట్లు శాంసన్ తెలిపాడు.

2015 జులైలో భారత్ తరఫున ఓ అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడాడు సంజు. ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన శాంసన్ టీ20 క్రికెట్లో స్టార్ క్రికెటర్‌గా ఎదిగాడు. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ టీమ్‌లో కొనసాగుతున్నాడు. గతేడాది వేలంలో వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ శాంసన్‌ను రూ.8కోట్లకు రాజస్థాన్ దక్కించుకుంది. రంజీ ట్రోఫీలో సంజు కేరళకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ప్రస్తుతం చారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తోంది.

1876
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles