బీజేపీలో చేరిన రవీంద్ర జడేజా భార్య

Mon,March 4, 2019 12:55 PM

Cricketer Ravindra Jadeja wife Rivaba solanki joins in BJP

జామ్‌నగర్‌ : భారత క్రికెటర్‌ రవీంద్ర జడేజా భార్య రివాబా సోలంకి నిన్న భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఆర్‌సీ ఫల్దు, ఎంపీ పూనమ్‌బేన్‌, ఎమ్మెల్యే బాకుభాయ్‌ జడేజా సమక్షంలో రివాబా బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆమెకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు బీజేపీ నాయకులు. గతేడాది నవంబర్‌ 20న ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని రవీంద్ర జడేజా, రివాబా కలిసిన సంగతి తెలిసిందే. 2016లో రవీంద్ర జడేజాకు రివాబాతో వివాహామైంది. ఈ దంపతులకు ఒక పాప ఉంది.

క్షత్రియ సమాజంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే కర్ణిసేనకు గుజరాత్‌ మహిళా విభాగం అధ్యక్షురాలిగా నియామకమైన ఆరు నెలలకే రివాబా.. బీజేపీలో చేరారు. బాలీవుడ్‌ చిత్రం పద్మావత్‌ విడుదలను నిరసిస్తూ కర్ణిసేన చేపట్టిన ప్రదర్శనల్లో రివాబా జడేజా చురుగ్గా పాల్గొన్నారు. అయితే త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో రాజ్‌కోట్‌ లేదా జామ్‌నగర్‌ నియోజకవర్గాల నుంచి రివాబా పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.

2025
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles