జ‌వాన్ల కుటుంబాల‌కు 5 ల‌క్ష‌ల విరాళం ఇచ్చిన క్రికెట‌ర్‌

Mon,February 18, 2019 03:39 PM

Cricketer Mohd Shami donates 5 lakhs to the wives of CRPF Jawans

న్యూఢిల్లీ: పుల్వామా దాడిలో మృతిచెందిన జ‌వాన్ల కుటుంబాల‌కు .. టీమిండియా క్రికెట‌ర్ మ‌హ్మాద్ ష‌మీ విరాళం ప్ర‌క‌టించారు. అమ‌రులైన జ‌వాన్ల కుటుంబాల‌కు 5 ల‌క్ష‌లు ఇస్తున్న‌ట్లు ష‌మీ తెలిపాడు. దానికి సంబంధించిన‌ చెక్‌ను సీఆరీపీఎఫ్ వైవ్స్ వెల్ఫేర్ అసోసియేష‌న్‌కు అంద‌జేశాడు. ఇవాళ ఢిల్లీలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న ఈవిష‌యాన్ని వెల్ల‌డించాడు. మేం దేశం కోసం ఆడుతుంటే, జ‌వాన్లు స‌రిహ‌ద్దు వ‌ద్ద ఉండి దేశాన్ని ర‌క్షిస్తున్నార‌ని, జ‌వాన్ల కుటుంబాల వెంట తామున్నామ‌ని, మేం ఎప్ప‌టికీ వాళ్ల‌తో ఉంటామ‌ని ష‌మీ అన్నాడు. ఇప్ప‌టికే జ‌వాన్ల పిల్ల‌ల‌ను చ‌దివిస్తామ‌ని మాజీ క్రికెట‌ర్లు సెహ్వాగ్‌, గంభీర్‌లు వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. బీసీసీఐ కూడా సీఆర్‌పీఎప్ జ‌వాన్ల‌కు 5 కోట్ల సాయం ప్ర‌క‌టించింది. పుల్వామాలో జ‌రిగిన కారు బాంబు దాడిలో 40 మంది జ‌వాన్లు మృతిచెందిన విష‌యం తెలిసిందే.

2052
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles