పేరు మార్చుకున్న క్రికెట‌ర్‌!

Thu,June 29, 2017 01:09 PM

Cricketer KL Rahul Changed his twitter name to support a young skater

బెంగ‌ళూరు: టీమిండియా క్రికెట‌ర్ కేఎల్ రాహుల్ పేరు మార్చుకున్నాడు. అయితే అది అధికారిక రికార్డుల ప‌రంగా కాదు. ఓ యువ స్కేట‌ర్‌కు మ‌ద్ద‌తివ్వ‌డం కోసం త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ పేరును ఆ స్కేట‌ర్ పేరు మీద మార్చుకున్నాడు. ఆ స్కేట‌ర్ పేరు నిశ్చ‌య్‌ లూత్రా. వ‌య‌సు 18 ఏళ్లు. 2018 వింట‌ర్ ఒలింపిక్స్‌లో ఎలాగైనా పార్టిసిపేట్ చేయాల‌ని సొంతంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. అటు ప్ర‌భుత్వం నుంచి, ఇటు స్పాన్స‌ర్ల నుంచి ఎలాంటి మ‌ద్ద‌తు లేదు. అత‌ని గురించి తెలుసుకున్న రాహుల్‌.. నిశ్చ‌య్‌కు మ‌ద్ద‌తివ్వ‌డమే కాదు.. ఇలా ట్విట్ట‌ర్‌లో త‌న పేరు మార్చుకొని అంద‌రికీ తెలిసిలే చేశాడు. నిజానికి నిశ్చ‌య్‌ కోసం అడిడాస్ కంపెనీ ఈ మ‌ధ్యే ఓ ప్ర‌చారం మొద‌లుపెట్టింది. #FanFire పేరుతో నిశ్చ‌య్‌ కోసం విరాళాలు సేక‌రించాల‌ని అడిడాస్ ల‌క్ష్యంగా పెట్టుకుంది. అత‌నిపై ఓ వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది అడిడాస్‌.


రాహులే కాదు.. రోహిత్‌శ‌ర్మ‌, రిష‌బ్ పంత్‌, ఉన్ముక్త్ చంద్‌లాంటి ఇత‌ర క్రికెట‌ర్లు కూడా ట్విట్ట‌ర్‌లో నిశ్చ‌య్‌కు త‌మ మ‌ద్ద‌తు తెలిపారు.
నిశ్చ‌య్‌ నేష‌న‌ల్ చాంపియ‌న్‌షిప్స్‌లో 9 గోల్డ్‌, 3 సిల్వ‌ర్ మెడ‌ల్స్ గెలిచాడు. ఇంట‌ర్నేష‌న‌ల్ లెవ‌ల్లోనూ ఓ గోల్డ్‌, బ్రాంజ్ మెడ‌ల్ సాధించాడు. అమెరికాలో ప్ర‌త్యేకంగా శిక్ష‌ణ తీసుకున్నా.. డ‌బ్బులు స‌రిపోక‌పోవ‌డంతో మ‌ధ్య‌లోనే ఇండియాకు తిరిగొచ్చేశాడు. ఏకంగా వింట‌ర్ ఒలింపిక్స్‌నే ల‌క్ష్యంగా పెట్టుకోవ‌డంతో శిక్ష‌ణ కోసం నిశ్చ‌య్‌కు భారీగా డ‌బ్బు సాయం అవ‌స‌రం ఉంది.

1867
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles