రాజకీయాల్లోకి గంభీర్.. ఏ పార్టీ తరఫున పోటీ చేస్తాడో తెలుసా?

Mon,August 20, 2018 12:56 PM

Cricketer Gautham Gambhir to contest in General Elections on a BJP ticket

ఢిల్లీ: కొన్నాళ్లుగా టీమ్‌కు దూరంగా ఉంటున్న టీమిండియా ఓపెనర్ గౌతమ్ గంభీర్ రాజకీయాల్లోకి వస్తున్నాడు. అంతేకాదు వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా అతడు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. జాతీయ భావాలు, దేశభక్తి ఎక్కువగా ఉండే గంభీర్‌కు భారతీయ జనతా పార్టీ తమ టికెట్ ఇవ్వాలని భావిస్తున్నది. దేశ రాజధాని ఢిల్లీ నుంచే గంభీర్‌ను బరిలోకి దింపాలని బీజేపీ చూస్తున్నది. దేశానికి సంబంధించి ఏ అంశంపై అయినా స్పందించడానికి గంభీర్ ఎప్పుడూ ముందే ఉంటాడు. ఈ విషయంలో గంభీర్‌కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగే ఉంది. ఇది తమకు ఉపయోగపడుతుందని భావిస్తున్న బీజేపీ.. గౌతీని బరిలోకి దింపడానికి సిద్ధమవుతున్నది.

ఇప్పటికే అజారుద్దీన్, సిద్ధూలాంటి క్రికెటర్లు రాజకీయాల్లో ఉన్నారు. అజర్ గతంలో ఎంపీగా చేయగా.. సిద్ధూ ప్రస్తుతం పంజాబ్‌లో మంత్రిగా పనిచేస్తున్నారు. అయితే గంభీర్ ప్రస్తుతానికి ఇంకా అధికారికంగా క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించలేదు. అతనికి ఎలాగూ మళ్లీ టీమ్‌లో చోటు దక్కే అవకాశాలు దాదాపు కనిపించడం లేదు. దీంతో రాజకీయాలపై దృష్టిసారించాలని అతడు నిర్ణయించుకున్నాడు. 36 ఏళ్ల గౌతీ.. 2011 వరల్డ్‌కప్ గెలిచిన టీమ్‌లో సభ్యుడిగా ఉన్నాడు. ఫైనల్ మ్యాచ్‌లో 97 పరుగులు చేసి విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. గంభీర్ తన కెరీర్‌లో మొత్తం 58 టెస్టులు, 147 వన్డేలు ఆడాడు.

3362
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles