వీడియో.. ఇలాంటి క్యాచ్ మీరు చూసి ఉండరు!

Tue,January 23, 2018 09:33 AM

Cricket never seen this kind of catch before for sure

మెల్‌బోర్న్‌ః క్రికెట్‌లో ఇప్పటికే ఎన్నో స్టన్నింగ్ క్యాచ్‌లను చూసి ఉంటారు. కానీ ఇలాంటి క్యాచ్ మాత్రం మీరు ఎప్పుడూ చూసి ఉండరు. బిగ్‌బాష్ లీగ్‌లో బౌండరీ దగ్గర ఇద్దరు ఫీల్డర్లు కలిసి అందుకున్న ఈ క్యాచ్ క్రికెట్ చరిత్రలో బెస్ట్ అనడంలో ఎలాంటి డౌట్ లేదు. సిడ్నీ టీమ్‌కు చెందిన జేక్ వెదెరాల్డ్, బెన్ లాలిన్ ఈ కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నారు. మొదట మెల్‌బోర్న్ రెనిగేడ్స్ బ్యాట్స్‌మన్ డ్వేన్ బ్రేవో గాల్లోకి లేపిన బంతిని బౌండరీ దగ్గర బెన్ లాలిన్ అందుకున్నాడు. అయితే ఈ క్రమంలో అతను బ్యాలెన్స్ తప్పడంతో బౌండరీ అవతల పడిపోయాడు. అంతకుముందే చేతిలో ఉన్న బాల్‌ను విసిరేశాడు. దీనిని 30 మీటర్ల దూరంలోని వెదరాల్డ్ తన ఎడమవైపునకు డైవ్ చేస్తూ అందుకున్నాడు. ఈ క్యాచ్ చూసి కామెంటేటర్లకు కూడా ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అసలు క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఇలాంటి క్యాచ్ చూడలేదని వాళ్లు అన్నారు.
5961
Follow us on : Facebook | Twitter
Namasthe Telangana Property Show

More News

VIRAL NEWS