క్రికెట్ ఆస్ట్రేలియాపై సచిన్ ఫ్యాన్స్ సీరియస్

Tue,April 24, 2018 01:05 PM

Cricket Australias tweet angers Sachin Tendulkars Fans

మెల్‌బోర్న్: ఏప్రిల్ 24 అనగానే.. క్రికెట్ అభిమానులకు గుర్తొచ్చేది మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ బర్త్‌డేనే. అయితే ఇదే రోజు ఆస్ట్రేలియా మాజీ పేస్ బౌలర్ దామియన్ ఫ్లెమింగ్ కూడా తన బర్త్ డే జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా క్రికెట్ ఆస్ట్రేలియా తమ బౌలర్‌కు బర్త్ డే విషెస్ చెప్పిన తీరు మాస్టర్ ఫ్యాన్స్‌కు కోపం తెప్పించాయి. 2000లో కార్ల్‌టన్ అండ్ యునైటెడ్ సిరీస్‌లో భాగంగా పెర్త్‌లో జరిగిన వన్డేలో సచిన్ టెండూల్కర్‌ను ఫ్లెమింగ్ క్లీన్‌బౌల్డ్ చేసిన వీడియో పెట్టి అతనికి బర్త్ డే విషెస్ చెప్పింది క్రికెట్ ఆస్ట్రేలియా.


ఇదే మాస్టర్ అభిమానులను ఆగ్రహానికి గురి చేసింది. సచిన్ బర్త్ డే రోజే కావాలని క్రికెట్ ఆస్ట్రేలియా ఈ వీడియో పోస్ట్ చేసిందని సీరియస్ అయ్యారు. మరి అదే ఫ్లెమింగ్ బౌలింగ్‌లో సచిన్ కొట్టిన ఈ మాస్టర్ స్ట్రోక్ గుర్తు లేదా అంటూ మరొకరు వీడియో పోస్ట్ చేశారు.
ఫ్లెమింగ్ ఓవరాల్‌గా వన్డేలు, టెస్టుల్లో కలిపి సచిన్‌ను ఏడుసార్లు ఔట్ చేశాడు. ఆస్ట్రేలియా తరఫున మాస్టర్‌ను ఎక్కువసార్లు ఔట్ చేసిన రికార్డు బ్రెట్ లీ పేరిటే ఉంది. అతడు 14 సార్లు సచిన్‌ను ఔట్ చేశాడు. ఆ తర్వాత స్థానాల్లో గ్లెన్ మెక్‌గ్రాత్ (13), గిలెస్పీ (8), ఫ్లెమింగ్ (7) ఉన్నారు. ప్రస్తుతం ఐపీఎల్‌లో కామెంటరీ చెబుతున్న 48 ఏళ్ల ఫ్లెమింగ్.. ఇండియాలోనే బర్త్ డే జరుపుకుంటున్నాడు.

2872
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS