28కే రెండు వికెట్లు.. కాట్రెల్ సెల్యూట్

Mon,June 10, 2019 03:37 PM

Cottrell picks second Markram departs

సౌతాంప్టన్: సెమీస్ పోరులో నిలువాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లోనూ సౌతాఫ్రికా ఆటతీరులో ఎలాంటి మార్పు కన్పించట్లేదు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా పేలవ బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్ ఆరంభించింది. సీనియర్ ఓపెనర్ ఆషీమ్ ఆమ్లా జట్టు స్కోరు 11వద్ద ఔటయ్యాడు. కాట్రెల్ బౌలింగ్‌లో ఫస్ట్‌స్లిప్‌లో ఉన్న క్రిస్‌గేల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మార్‌క్రమ్ కూడా ఎక్కువసేపు నిలవలేదు. మార్‌క్రమ్ సైతం కాట్రెల్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ షెయ్ హోప్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 6.1 ఓవర్లకే సౌతాఫ్రికా 2 వికెట్లకు 28 పరుగులు చేసింది. మరో ఎండ్‌లో ఓపెనర్ క్వింటన్ డికాక్(16) క్రీజులో ఉన్నాడు.3168
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles