జవాన్ల కుటుంబాలకు బీసీసీఐ భారీ విరాళం..!

Sun,February 17, 2019 03:29 PM

CK Khanna writes to CoA, requests BCCI to donate Rs 5 crore for Pulwama martyrs

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడిలో అసువులు బాసిన వీర జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు దేశవ్యాప్తంగా ఎంతో మంది ముందుకొచ్చారు. పారిశ్రామిక వేత్తలు, సెలబ్రిటీలు, క్రీడాకారులు, వ్యాపార సంస్థలు తమకు వీలైనంత ఆర్థిక సాయాన్ని ప్రకటించాయి. తాజాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కూడా భారీ మొత్తాన్ని విరాళంగా ఇచ్చేందుకు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో క్రికెట్ పాలకుల కమిటీ(సీవోఏ)కి బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా విజ్ఞప్తి కూడా చేశారు. అమర జవాన్ల కుటుంబాలకు కనీసం రూ.5కోట్లు సాయం ప్రకటించాలని పాలకుల కమిటీని కోరారు. భారత క్రికెట్ బోర్డు పాలనా వ్యవహారాలను సీవోఏ పర్యవేక్షిస్తోన్న విషయం తెలిసిందే. ఆర్థిక సాయంపై క‌మిటీ తుది నిర్ణ‌యం తీసుకోనుంది.

4631
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles